స్టాక్ మార్కెట్ ల పతనానికి ప్రధాన కారణాలు

స్టాక్ మార్కెట్ పతనం అంటే ఏమిటి?

సాధారణం గా ఒక Bull Run తర్వాత స్టాక్స్ విలువలు వాటి నిజమైన విలువకు అనేక రెట్లు పెరుగుతాయి.ఈ దశలో అకస్మాత్తుగా కానీ ,లేక క్రమ క్రమం గా కాని సూచీలు (Nifty ,Sensex) పడిపోవడం జరుగుతుంది.ఇదే స్టాక్ మార్కెట్ పతనం .

స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు:

1. అధిక ధరలు: Bull run లో స్టాక్ ధరలను ఎన్నో రెట్లకు మించి ఇన్వెస్టర్లు ఖరీదు చేస్తారు. అంటే వాటి అసలైన విలువకు ఎన్నో రేట్లకు మించి కొనడం వల్ల స్టాక్ ల P/E నిష్పత్తి {price earning ratio} అత్యధిక మొత్తాలకు చేరుతుంది. అత్యధిక P/E విలువల వద్ద మార్కెట్ ఒక నీటి బుడగలా మారి ఒక చిన్న negative అంశం వల్ల కూడా పతనం అయ్యే అవకాశం ఉంటుంది.

2. రాజకీయ అస్థిరత్వం: స్థిరమైన ప్రభుత్వం స్టాక్ మార్కెట్ లో bull run కి మంచి ఊపుని ఇస్తుంది.దీనికి భిన్నం గా అస్థిరమైన మైనారిటీ ప్రభుత్వం,hung parliament లు మార్కెట్ అనిశ్చితికి తోడ్పడి సూచీలు పతనమయ్యేలా తోడ్పడుతాయి . అంతేగాక ఉగ్రవాద చర్యలు ,సునామి,భూకంపం,వర్షాల లేమి,వరదలు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు కూడా మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని Hollywood సినిమాల్లో స్టాక్ మార్కెట్ ను పడగొట్టి కోట్లు సంపాదించేలా ప్లాన్ వేసిన విలన్ దాని కోసం ఉగ్రవాద చర్యలకు పాల్పడటం కూడా గమనించవచ్చు.

3. లాభాల స్వీకరణ: మార్కెట్ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నప్పుడు సహజం గానే లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు.అయితే ఈ ప్రభావం దేశీయ ఇన్వెస్టర్ల కన్నా FII లు [Foreign Institutional Investors] లాభాల స్వీకరణకు దిగినపుడు చాలా స్పష్టంగా, తీవ్రంగా ఉంటుంది. అంతే గాక ఒక్కసారి సూచీలు negative గా మారగానే మార్కెట్ ని కుప్ప కూల్చి లాభాలు దండుకునే bear లు కూడా రంగం లోకి దిగుతారు.

మార్కెట్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారు మంచి లాభాలతో బయట పడగా సూచీలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ప్రవేశించిన వారు నష్టపోవడం జరుగుతుంది.

4.Major scams: ప్రభుత్వం లో బయట పడే స్కాం లు కూడా  మార్కెట్ ని కృంగతీస్తాయి.మరీ ముఖ్యం గా స్టాక్ మార్కెట్ లో సంభవించే scam ల యొక్క ప్రభావం మరీ ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యం గా మార్కెట్ లో scam లు సంభవించినప్పుడు కొంతమంది రిస్క్ అంటే ఇష్టం లేని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని ఉపసంహరించుకొని మార్కెట్ నుండి వెళ్ళిపోతారు.అంటే గాక కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేద్దామనుకున్న వారిలో కొంతమంది ఆ ఆలోచనను విరమించుకుంటారు

Market  ని కుదిపేసిన కొన్ని scamలలో Harshed mehta scam, Khetan parekh scamలు ముఖ్యమైనవి.

5. వడ్డీ రేట్ల పెంపు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రెట్లు గనుక పెంచినట్లయితే అది కూడా మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.ఎందుకంటే కంపెనీలు తమ వ్యాపార నిర్వహణ కోసం బ్యాంకు ల నుండి అప్పు తీసుకుంటాయి. RBI యొక్క వడ్డీ రేట్ల పెంపు  వల్ల వారి లాభాల్లో ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లింపులకే సరిపోయి లాభాల శాతం తగ్గి పోతుంది .లాభాలు లేని వ్యాపార సంస్థల్లో మదుపు చేయడానికి ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఆసక్తి చూపడం జరగదు. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపని స్టాక్స్  సహజంగానే పతనం చెందుతాయి.

స్టాక్ మార్కెట్ పతనం వల్ల ప్రయోజనాలు :

మార్కెట్  పతనం  వల్ల ఇన్వెస్టర్లకు  నష్టం  జరుగుతునదనేది జగమెరిగిన సత్యం.

అయితే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అవి:

  • మార్కెట్ పతనం వల్ల స్టాక్స్ ధరలు తక్కువ స్థాయిలకు చేరుకోవడం వల్ల ఇన్వెస్టర్ లకి కొత్త కొనుగోలు అవకాశాలు లభిస్తాయి.
  • సూచీలు ఉన్నత స్థాయికి చేరడం,పతనం కావడం ఈ రెండూ ఆరోగ్యవంతమైన స్టాక్ మార్కెట్ లక్షణాలు . అప్పుడప్పుడూ market crash/correction జరుగుతున్నదంటే ఆ మార్కెట్ సరైన పద్ధతిలో పయనిస్తుందని  అర్ధం.
  • అందరూ అనుకునే దానికి భిన్నం గా ఒక సామాన్య ఇన్వెస్టర్ మార్కెట్ పతనం లో కూడా లాభాలు పొందవచ్చు. అది ఎలాగో తర్వాతి article లో చూద్దాం.

స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం చిన్న ebooks లాగా రూపొందించడం జరిగింది. ఆసక్తి గలవారు క్రింది లింకుని click చేయవచ్చు.

http://bit.ly/2dyNxz2

cover-image

 

(Visited 1,590 times, 1 visits today)

Join the Conversation

1 Comment

  1. Gone through your website and learned many things about stock marketing and risks and technical analysis. Thanks a lot for giving such a valuable tips and information for the new investors.

Leave a comment

Leave a Reply to N.Venkatesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *