What is Sensex, Nifty in Telugu?

Sensex, Nifty meaning in Telugu

మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారితోపాటు లేనివారు కూడా టీవీల్లో, పత్రికల్లో sensex, Nifty లాంటి పదాలను గురించి వినే ఉంటారు. అసలీ పదాల అర్థం ఏమిటి అన్న సందేహం మనలో చాలామందికి వొచ్చే వుంటుంది.

స్టాక్ మార్కెట్లోని అనేక సెక్టార్లలో, కొన్నివేల చిన్నా పెద్దా stocks ప్రతీరోజూ ట్రేడ్ అవుతూ ఉంటాయి. మీరొక స్టాక్ లో invest చేయదలుచుకున్నప్పుడు కలగూరగంపలా ఉండే దీంట్లోంచి ఆ ఒక్క స్టాక్ ను వెతికి పట్టుకోవడం తలకి మించిన భారంగా అనిపిస్తుంది. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది.

మీ ముందర ఓ రెండు మొబైల్ ఫోన్లు ఉంచి, అందులోనుంచి ఒకటి ఎంచుకోమంటే మీ పని ఎంతో ఈజీ అవుతుంది కదూ! ఆ రెంటి ఫీచర్స్ ని పోల్చి చూసి (Google ఉపయోగించి) మీకు అవసరమున్నదానిని తీసుకోవచ్చు. ఇది రెండు నిముషాల పని . కాని ఓ పెద్ద మొబైల్ షో రూమ్ కి మిమ్మల్ని తీసుకెళ్ళి కొన్ని వందల మోడళ్ళనుండి, ఫలానా budgetలో ఓ ఫోన్ ని సెలెక్ట్ చేయమన్నప్పుడు మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది.

మీకు కావాల్సిన ఫీచర్స్ ని నోట్ చేసుకొని దానికి సరిగ్గా సరిపోయే కొన్ని మోడళ్ళని వెతికి, సమయముంటే యూజర్ల రివ్యూలు చదివి, ఆ తరువాత చివరగా ఒకదానిని final చేస్తారు. అందుకే ఎక్కువమంది చేసే పనేమిటంటే research పని అంతా ఇంట్లోనే పూర్తి చేసుకోవడం, లేకపోతే షాప్ లో తికమక పడాల్సి వస్తుంది.

సూచీలు కూడా ఇంచుమించు ఇలాగే పని చేస్తాయి.

1. సరైన స్టాక్ ని ఎంచుకోవడానికి:

కాపిటలైజేషన్ వారిగా, సెక్టార్ వారీగా ఏవి లాభాల్లో పయనిస్తున్నాయి వేటి performance ఎలా ఉంది అన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు.

2.పోల్చడానికి:

ఒక స్టాక్ ని మరో స్టాక్ యొక్క performance తో పోల్చనిదే వాటిలో ఏది మంచి పనితీరు గలదో గుర్తించలేము. ఇలా రెండు కంపెనీలను ఒకదానితో ఒకటి పోల్చడంతో పాటు, ఒక స్టాక్ ని బెంచ్ మార్క్ ఇండెక్స్ లైన sensex, nifty లతో కూడా పోల్చవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఓవరాల్ మార్కెట్ తో పోల్చినపుడు ఓ స్టాక్ performance ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

3.సెంటిమెంటుని తెలుసుకోడానికి:

మార్కెట్ సెంటిమెంటు అనేది చాలా ముఖ్యమైనది. ఈ సెంటిమెంటే మార్కెట్ ట్రెండుని డిసైడ్ చేస్తుంది కూడా. కేవలం ఈ సూచీలను పరిశీలిస్తుండడం ద్వారా మార్కెట్ సెంటిమెంటుని, ఇన్వెస్టర్ల moodని అర్థం చేసుకోవచ్చు.

4.మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని ఇన్వెస్టర్లు సింపుల్ గా ఇండెక్స్ fundలో పెట్టుబడి పెడతారు. అంటే sensex తప్పనిసరిగా మరింత పైకి చేరుకుంటుందని భావించినపుడు ఆ ఇండెక్స్ fund లో invest చేస్తారు. ఈ fund మేనేజర్ల పని కూడా చాలా సులువు. ఇన్వెస్టర్ల సొమ్ముని sensex లోని 30 కంపెనీలలో invest చేయడం. దీనికి మిగతా funds లాగా తీవ్రంగా research చేయాల్సిన అవసరం కూడా లేదు.

అసలు sensex అంటే ఏమిటి?

(sensex= SENSitve indEX)

sensex అనేది ఒక సూచీ. ఇది మార్కెట్ ఓవరాల్ గా పైకి వెళ్తున్నదా లేక పతనమవుతున్నదా అన్న విషయాన్ని సూచిస్తుంది.

sensex BSE (Bombay Stock Exchange)లో ట్రేడ్ అవుతున్న కొన్నివేల కంపెనీలలో 30 stocks ని కలిగి ఉంటుంది.

Nifty అంటే ఏమిటి?

ఈ సూచీ పేరు National మరియు  FIFTY అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (NSE) యొక్క బెంచ్ మార్క్ సూచీ. ఈ ఇండెక్స్ NSE లో ట్రేడ్ అవుతున్న 50 stocks ని కలిగి ఉంటుంది.

sensex లోగానీ, niftyలోగానీ ప్రస్తుతమున్న stocks శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నవి కావు. అవసరాన్ని బట్టి, వాటి performance ని బట్టి ఒక కంపెనీని తొలగించి దాని స్థానంలో మరో స్టాక్ ని తీసుకునే అవకాశముంది. ఉదాహరణకి Niftyలో ఏప్రిల్ 1, 2016 నుండి Punjab National Bank స్థానంలో Aurobindo Pharma వచ్చి చేరింది.

 ఈ సూచీల్లోకి ఏ కంపెనీలను చేర్చాలి, దీనిని తొలగించాలి అనేదానిని  “free-float market capitalization” ని ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది.

సూచీల వల్ల ఇబ్బందులు:

  • కొన్నివేల కంపెనీల నుండి కేవలం కొన్నింటినే ఎంచుకొని అవి మార్కెట్ సెంటిమెంటుని ప్రతిబింబిస్తాయని భావించడం సరైన విషయం కాదు. కొన్నిసార్లు సూచీలు ఒక దిశలో మార్కెట్ మొత్తం మరో దిశలో చలించడం కూడా జరుగుతుంది.
  • అదీగాక మీరు కేవలం ఒకటి లేదా రెండు stocks లో మాత్రమే ట్రేడింగ్ చేయాల్సి వచ్చినపుడు కేవలం ఆ స్టాక్ గురించే విశ్లేషించాలి గానీ ఈ సూచీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. nifty పతనమైనపుడు మీరెంచుకున్న స్టాక్ పైకి పరిగెత్తవచ్చు. లేదా nifty పైకి దూసుకెళ్తున్నపుడు మీ స్టాక్ క్రిందికి జారవచ్చు.

స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం కోసం ఈ క్రింది ebooks ని చదవండి.

6 in 1: Ultra offer
6 in 1: Ultra offer
(Visited 4,084 times, 11 visits today)

2 thoughts on “What is Sensex, Nifty in Telugu?

  1. Respected Sir,
    This is kona sunny . I have red about share market meaning .so very nice explained sir
    Thank you sir

    Sir please more sending market tips . i need telugu language sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *