స్టాక్ మార్కెట్ లో కి కొత్తగా ప్రవేశించిన ఇన్వెస్టర్ల కి మార్కెట్ కి సంభందించిన పదాలు [Jargon] చాలా కొత్తగా, విచిత్రం గా అనిపిస్తాయి. ఈ మార్కెట్ పదకొశాలలో రెండు అతి ముఖ్యమైన పదాలు.
1. Fundamental analysis
2. Technical analysis.
ఒక స్కూల్ కి వెళ్ళే పిల్లవాడికి కూడా అర్ధం అయ్యే విషయం ఏమిటంటే స్టాక్ మార్కెట్ లో ఏ స్టాక్ ధర అయితే పెరుగుతుందో మనం ముందే గ్రహించగలిగితే మన పంట పండినట్లే.
కాని అలాంటి స్టాక్స్ ని గుర్తించే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా ?
నూటికి నూరుపాళ్ళు విజయం సాధించే టెక్నిక్ అయితే ఏదీ లేదు. కానీ కొంతమటుకు ఈ విషయం లో పైన చెప్పుకున్న రెండూ( Fundamental analysis, Technical analysis ) సహాయం చేస్తాయి.
Technical analysis, ఒక స్టాక్ యొక్క గత చరిత్ర ,గత price movements ఆధారంగా, భవిష్యత్తులో దాని ధరను ఊహించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ స్టాక్ uptrend లో ఉండబోతుందా లేక downtrend లో కి వెళ్ళబోతుందా అని ఊహిస్తుంది.
దీనికి భిన్నంగా Fundamental analysis, స్టాక్ యొక్క ట్రెండ్ ను ఊహించే బదులు మార్కెట్ లో లభ్యమవుతున్న స్టాక్స్ యొక్క నిజమైన విలువ [intrinsic value] ను గుర్తించి తద్వారా అవి ఇతర షేర్లతో పోల్చినపుడు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నాయో లేదో తెలుపుతుంది. అంటే ఒక స్టాక్ యొక్క నిజమైన విలువను తెలపడానికి యత్నిస్తుంది.
నిజమైన విలువ ( Intrinsic Value) అంటే ఏమిటి?
20 వ శతాబ్దం చివరి రోజులలో వచ్చిన dotcom bubble లో టెక్ కంపెనీల మార్కెట్ ధరలు వాటి అసలు విలువ కన్నా అనేక రెట్లు పెరిగిపోయింది. Fundamental analysis ద్వార ఆ కంపెనీల నిజమైన విలువను గణించడానికి బదులు ఇన్వెస్టర్లు ఆ boom ని నమ్ముకొని గుడ్డిగా సంపదను ఇన్వెస్ట్ చేశారు. కొందరైతే ఆ కంపెనీ పేరు అద్భుతంగా ఉంటే చాలు దానిని గురించి ఏమి తెలుసుకోకుండా మదుపు చేశారు.
ఫలితం……….Dotcom bubble పగిలింది. ఇన్వెస్టర్లు నష్టపోయారు.
రెండు కంపెనీ లు [A,B] యొక్క స్టాక్ ధరలు 100 రూపాయలు అయినప్పుడు, సాధారణ ఇన్వెస్టర్లు రెంటి మార్కెట్ ధర ఒక్కటే కాబట్టి రెంటికి ఏ మాత్రం తేడా లేదు అనుకుంటారు. కాని ఈ రెంటిలో A కంపెనీ కి చాలా అప్పులు ఉండి, B కంపెనీ కి విలువైన భూములు [రియల్ ఎస్టేట్] ఉన్నట్లయితే B కంపెనీ యే ఇన్వెస్ట్మెంట్ కి మంచిదని సరైనదని చెప్పవచ్చు.
ఇదే Fundamental analysis.
ఫండమెంటల్స్ ని చూసే ఇన్వెస్టర్ “ Fundamentals బలంగా ఉంటే తప్పకుండా కంపెనీ లాభాలు ఆర్జిస్తుంది.అందువల్ల స్టాక్స్ ధర కూడా పైకి ఎగబ్రాకుతుంది” అని నమ్ముతాడు. అంతే కాక ఈ రకం ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహం తో ఉంటారు. వీరికి ప్రతి రోజు స్టాక్ ధరలను చూసుకోవలసిన పని ఉండదు.
Fundamental investor ఈ క్రింది వాటిని జాగ్రత్తగా విశ్లేషిస్తాడు
- కంపెనీ balance sheet.
- లాభాలు నష్టాలు.
- వార్షిక నివేదిక [Annual Report]
- కంపెనీ announcements.
Fundamental analysisలోని ప్రధాన అంశాలు:
1.Earnings: ఒకకంపెనీ యొక్క ఎర్నింగ్స్ క్రమం తప్పకుండా పెరుగుతున్నట్లయితే ఆది లాభాల్లో ఉంటుందన్న మాటే. ఎర్నింగ్స్ ని ఒక్కో షేర్ కి లెక్క కట్టినట్లయితే దానిని EPS [earnings per share] అంటారు. అంటే ఆ కంపెనీ యొక్క ఒక్కో స్టాక్ సంపాదించిన మొత్తం ఇది.
2.Profit margins: ఒక సంస్థ యొక్క earnings ఎంత గొప్పగా ఉన్నప్పటికి దాని నిర్వహణ వ్యయాలు అధికంగా ఉంటే దాని నికర లాభాలు [net profit] చాలా తక్కువగా ఉంటాయి. లాభాలు లేని కంపెనీల వల్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
ఉదాహరణకి ఒక సినిమా విడుదల అయ్యి 60 కోట్లు వసూలు చేసిందనుకుందాము.అది గొప్ప హిట్ సినిమా అనుకోవచ్చు. కాని దాని బడ్జెట్ 40 కోట్లు అయితే గనుక దాని వల్ల మిగిలిన లాభం 20 కోట్లు,[అంటే పెట్టుబడిలో 50% మాత్రమే.]. అలాకాకుండా 15 కోట్లతో తీసిన చిన్న సినిమా 30 కోట్లు వసూలు చేస్తే దాని నికర లాభం 15 కోట్లు[పెట్టుబడికి సమానం] . అంటే నిర్మాతకు రెట్టింపు డబ్బు వచ్చినట్లే.
3.ఆస్తులు – అప్పులు : ఎంత పెద్ద సంస్థ అయినప్పటికీ అది అప్పులలో కూరుకొని పోయి ఉంటే నష్టాల బాటలో వెళ్తున్నట్లే. అవి చెల్లించాల్సిన వడ్డీ కూడా దాని లాభాలని మింగేస్తుంది.
కొన్ని కంపెనీ లు వాటి వ్యాపారాలలో నష్టపోయినప్పటికీ వాటికున్న స్థలాల రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం తో అనూహ్యంగా కోలుకొని బయట పడ్డాయి.
4.Return on Equity : ఇన్వెస్టర్లు మదుపు చేసిన డబ్బుతో ఓ కంపెనీ ఎంత లాభాలను ఆర్జించగలుగుతుందో అదే ROE.
ROE = Net income/shareholder equity
ఇదే ఇన్వెస్టర్ల డబ్బును ఓ కంపెనీ ఎంత సమర్దవంతం గా ఉపయోగించగలుగుతుందో తెలుపుతుంది .
ROE ఎల్లప్పుడూ percentage గానే చెప్పబడుతుంది.
ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి మరింత విలువైన సమాచారం కోసం చదవండి.
Sir,
I am holding S.B.I 100 @320/-and icici 50 @318/- Gati 60@238/.How can I reduce the loss on these stocks . Pl advice.
Please inform above shares
Great information thank-you sir