Valuable Day Trading Tips-Telugu

Valuable Day Trading Tips Telugu:
Day trading అంటే ఒక రోజు వ్యవధిలో, వీలైతే కొన్ని గంటల వ్యవధిలో స్వల్ప లాభాల కోసం చేసే trading. వీరు speculation (జూదం) చేస్తారు గనుక వీరిని speculators అంటారు.Day trading రిస్క్ తో కూడుకున్నది అయినప్పటికీ చాలా తక్కువ వ్యవధిలో లాభాలు సంపాదించే అవకాశం ఉండడంచే tradersకి ఆకర్షణీయంగా అనిపిస్తూంది.

Day Trading Pros:  తక్కువ వ్యవధిలో లాభాలు సంపాదించే అవకాశం ఉండడం

Day Trading Cons:

  • రిస్క్ తో కూడిన వ్యవహారం.
  • లాభాల రుచి తగిలిందంటే Day Trading వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.
  • Traders యొక్క బలహీనతలను కాష్ చేసుకోడానికి అనేక మోసపూరిత సంస్థలు ప్రయత్నిస్తూంటాయి.
  • అవసరానికి మించిన సమాచారం internatలో లభించడం వల్ల traders ఏదీ నిర్ణయించుకోలేక confuse అవుతారు.

Day Tradingకి అనుకూలమైన స్టాక్ ని ఎంపిక చేసుకోడం ఎలా?

long term investment కీ Day Tradingకి చాలా తేడా ఉంది. అక్కడ ఉపయోగించే పద్ధతులను Day Tradingలో ఉపయోగించడం సరయింది కాదు. క్రింది అంశాలను దృష్టిలో పెట్టుకుని మంచి స్టాక్ ని ఎంచుకోవాలి.

1. మంచి trading volume:

volume అంటే ఒక రోజులో చేతులు మారిన ఒక స్టాక్ షేర్ ల సంఖ్య. ఒక స్టాక్ కి ఎక్కువ volume ఉంటె ఆ స్టాక్ లో ఎక్కువ అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగాయన్న మాట. అంటే అమ్మడానికి కొనడానికి traders ఆసక్తిని కలిగి ఉన్నారని అర్థం. అధిక volume ఉన్న స్టాక్ లో ట్రేడ్ చేయడం వల్ల మనకు అవసరమైనపుడు ఆ స్టాక్ నుండి exit కావచ్చు. volume లేని స్టాక్ లో అయితే మనం exit అవుదామనుకున్నా కొనేవారు లేక మనం ఇరుక్కపోవాల్సి వస్తుంది.
2.మంచి price range:

price range అంటే దాదాపుగా ప్రతీ రోజు ఆ స్టాక్ ఒక నిర్ణీత శ్రేణి లో చలిస్తూ ఉండాలి. బొత్తిగా కదలిక లేకుండా ఉండే స్టాక్స్ Day Tradingకి పనికి రావు.

3. మంచి price:

మార్కెట్ లో అతి తక్కువ ధరలకి (అంటే ఒక రూపాయి నుండి 5-10 రూపాయల వరకు) లభించే స్టాక్స్ ని Penny Stocks అంటారు. సాధారణంగా కొత్త traders ఈ Penny Stocks అంటే ఇష్టపడతారు. ఎందుకంటే 100 రూపాయలకి ఒక మంచి షేర్ కొనడం కన్నా 5 రూపాయల షేర్ లు 20 కొనడం మంచిది అన్న భావన లో వారు ఉంటారు. బహుశా “ నా దగ్గర ఒక షేర్ ఉంది “ అన్న ఫీలింగ్ కన్నా “నా దగ్గర 20 షేర్ లు ఉన్నాయి “అన్న ఫీలింగ్ బాగుంటుంది కాబోలు.

అయితే Day Tradingకి ఈ Penny Stocks సరయినవి కావు. చాలా Penny Stocksల volume తక్కువగా ఉంటుంది, అంతే గాక Penny Stocksలో Manipulationకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలా అని చాలా ఎక్కువ ధరలో లభించే blue chips వైపు కూడా చూడాల్సిన అవసరం లేదు. రెంటికీ మధ్యస్తంగా ఉండే midcps గాని లేక blue chips లలో మనకి అనుకూలమైన ధరల్లో లభించే వాటిని సెలెక్ట్ చేసుకోడం మంచిది.

4.break outs:

Day Traders fundamental analysis కన్నా టెక్నికల్ analysis వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఒక రోజు time spanలో fundamental analysis కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అందువల్ల break outs లాంటి టెక్నికల్ indicators వైపే మెజారిటీ traders మొగ్గు చూపుతారు.
5. Find Stocks with unusual volume:

ఒక స్టాక్ యొక్క volume గత కొన్ని రోజులుగా పెరిగిందంటే ఆ స్టాక్ లో trend బలంగా ఉందన్నమాటే. కాబట్టి ఆ స్టాక్ యొక్క 30 days average volume ని గమనిస్తే మనకి చాల విషయాలు అర్థం అవుతాయి.

సాధారణంగా స్టాక్స్ లలో అకస్మాత్తుగా కొత్త trend ప్రారంభం కావడం సహజంగా జరిగే విషయమే. అయితే ఈ ట్రెండ్స్ నిజంగా బలమైనవేనా కాదా అని తెలుసుకోవాలంటే volume వంక చూడాలి. ఒకవేళ high volumeతో ఒక trend ప్రారంభ మైనపుడు అది స్థిరమైన trend అని అనుకోవచ్చు. అయితే మార్కెట్ లోని ఏ స్టాక్స్ లలో అకస్మాత్తుగా అత్యధిక volume తో trading జరుగుతుందో మనం ఈ క్రింది siteలలో తెలుసుకోవచ్చు.

Day Trading గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, టిప్స్ ఈ చిన్ని పుస్తకంలో పొందుపరచబడ్డాయి.

cover-tsp

buy-now-1

 

(Visited 4,337 times, 1 visits today)

6 thoughts on “Valuable Day Trading Tips-Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *