Penny Stocks: Advantages, Disadvantages (in Telugu).
అతితక్కువ షేర్ ధర కలిగి ఉండి, అతి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిఉన్న షేర్లను పెన్నీ స్టాక్స్ అనవచ్చు. భారత దేశంలో 5 పైసల నుండి మొదలుకొని పది రూపాయల వరకూ ధర కలిగిఉన్న stocks ని పెన్నీ stocks అనడం జరుగుతున్నది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్లలోపు ఉన్నాకూడా పెన్నీ stocks అనడం జరుగుతున్నది. అదే అమెరికాలో ఒక డాలర్ కన్నా తక్కువ ధర కలిగిన షేర్లను పెన్నీ stocks అంటారు.
పెన్నీ స్టాక్స్ అన్నీ highly speculative.
అంటే ఒక్కసారిగా పైకి పరిగెట్టడంతో పాటు అంతే వేగంగా అకస్మాత్తుగా నేలకూలే ప్రమాదముంది. ఈ పెన్నీ stocks ఎంతో రిస్కుతో కూడుకున్నవి. ఎంత రిస్కునైనా భరించగలమని అనుకునేవారికి మాత్రమే ఇవి తగినవి. అయితే ఇవి ఇచ్చే లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి. ఈ షేర్లు ఒక్కరోజులోనే 20% వరకూ పెరగగలవు.
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు సాధారణంగా bluechip కంపెనీలనే ఇష్టపడతారు. ఎక్కువ మార్కెట్ ధర కలిగి, మంచి ఫండమెంటల్స్ తో అధిక క్యాపిటలైజేషన్ కలిగిఉన్న bluechip షేర్లు మీ పెట్టుబడిని రెండింతలు చేయడానికి పట్టే సమయంలో కేవలం నాలుగో వంతు భాగంలోనే, ఈ పెన్నీ stocks ఆ పనిని చేయగలవు. ఇక రిస్కు విషయానికొస్తే bluechip కంపెనీల్లో మీ పెట్టుబడికి ఉన్న రక్షణ ఈ పెన్నీ స్టాక్స్ లో ఉండదు.
పెన్నీ stocks లలో రిస్కూ ఎక్కువే, లాభాలూ ఎక్కువే.
BSEలో list అయిన స్టాక్ లలో 25% వరకూ పెన్నీ stocks.
ఈ పెన్నీ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లకి ఉన్న క్రేజ్ కి కారణమేమిటంటే ఇవి తక్కువ ధరలో లభ్యం కావడం. ఇందువల్ల అందరూ ఎగబడి కొనడం జరుగుతున్నది.
కొంతమంది ఇన్వెస్టర్లు ఎక్కువ సంఖ్యలో షేర్లు కొనుగోలు చేసామని గొప్పగా చెప్పుకోడానికి ఇష్టపడతారు. ఇలాంటివారికి blue chip షేర్లను పొందటం తలకు మించిన భారమవుతుంది. అందుకే ఊరూ పేరూ లేని ఈ పెన్నీ స్టాక్స్ ని కొని “ఫలానా stocks ఓ వెయ్యి నిన్ననే కొనిపడేశానోయ్” అని కనబడ్డ వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. పాపం…ఆ ఎదుటివారికి కూడా మార్కెట్ పై పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల “నిజమే, పెద్ద కంపెనీలే కాబోలు …” అని అనుకుంటారు.
ఇది ఎలా ఉంటుందంటే మీవద్ద 20×40 సైజు గల మూడు ప్లాట్లు ఉన్నాయనుకుందాం. మీరు 60×40 సైజున్న ప్లాట్ ఓనర్ దగ్గరికి వెళ్లి “నాకు మూడు ప్లాట్లున్నాయి తెలుసా” అని గొప్పగా చెప్పుకోవడం లాంటిది. ప్లాటు సైజు తెలిసేవరకూ మీరే గొప్పవారు, మీకే ఎక్కువ ఆస్తులున్నాయన్నమాట.
అదే విధంగా ఈ పెన్నీ స్టాక్స్ తో వచ్చిన చిక్కేమిటంటే వీటిని ఆపరేటర్లు సులభంగా manipulate చేయడం జరుగుతుంది. అనేక research institutes, బ్రోకింగ్ ఫర్మ్స్ ఈ పెన్నీ స్టాక్స్ ని కొనవలసిందిగా సిఫార్సులను అందిస్తుంటాయి. మరికొంతమంది ఆపరేటర్లు బ్రోకింగ్ సంస్థలు సిఫార్సు చేసినట్లుగా బ్రోకింగ్ సంస్థల పేరు మీద sms లు పంపించడం చేస్తున్నారు. నిజానికి తెలివైన వారెవరూ అడగకముందే ఉచిత సలహాలు ఎవ్వరికీ ఇవ్వరు. కొన్ని బ్రోకింగ్ సంస్థలు తమ కస్టమర్ల కోసం మాత్రం ఈ ఉచిత సిఫార్సులను అందరికీ అందిస్తున్నాయి. ఈ సిఫార్సులకి ఎలాంటి గ్యారంటీ కూడా ఉండదు. అందుకే ఎవరైనా సిఫార్సు చేసినా కూడా తార్కికంగా ఆలోచించకుండా వాటిని కొనుగోలు చేయకూడదు.
చాలాసార్లు ఇలాంటి operators పై సెబి చర్యలు తీసుకుంటూ ఉంటుంది, అవసరమైతే delist చేయడం కూడా చేస్తుంది.
ప్రతీ బ్రోకింగ్ సంస్థ కూడా ఒక స్టాక్ ని కొనవలసిందిగా సిఫార్సు చేసినపుడు, రిస్కు గురించిన disclaimer తో పాటు తమకు అందులో వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదని తెలుపుతూ చెప్పాలి.
Sir 6in1 ultra offer I can’t , download sir please response
try this link..
https://www.instamojo.com/earningtrigger/6-in-1-ultra-offer/
Sir I don’t have an idea ,I want to invest pls advise