Online Stock Trading Tips Telugu.

Online Stock Trading:

చాలా సంవత్సరాల క్రితం ట్రేడింగ్ చేయాలి అంటే మార్కెట్ ఫ్లోర్ (stock broker’s office)దగ్గరకి వెళ్లి చేయాల్సి వచ్చేది. మనం అక్కడకి వెళ్ళకపోతే చేయలేక పోయేవాళ్ళం.కాని ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మనం ఇంట్లో నుంచయిన ,ఆఫీస్ నుంచి అయిన ఎక్కడినుంచి అయినా సరే ఇంటర్నెట్ ఉంటె చాలు ట్రేడ్ చేసుకోవచ్చు.

ఎన్నో విప్లవాత్మక మార్పులు తర్వాత ఇంటర్నెట్ లో  ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ మొదలైంది.ఈ స్టాక్ మార్కెట్ అనేది ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి కూడా చేయగలిగే స్థితి లో ఉంది.దీనిలో పెట్టుబడిదారులు ఇంటర్నెట్ లోని టేక్నాలజి ద్వారా ఎక్కడి నుండయినా Market Trading Hours లో మనకి అవసరమైన మైన స్టాక్ ని ట్రేడ్ చేసుకోవచ్చు.కేవలం ఒకే ఒక క్లిక్ తో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల లావా దేవిలు జరుగుతున్నాయి. అంతలా పెరిగి పోయింది టెక్నాలజీ.

స్టాక్ brokerage సంస్థలు స్టాక్స్ అమ్మడం, కొనడం లాంటి సేవలు అందించడం మాత్రమే కాకుండా సలహాలు, Recommendations కూడా ఇస్తాయి, అంటే షేర్స్ కి సంభందించిన విషయాలను,షేర్స్ కొనడం, అమ్మడం .,జాగ్రతగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో దానిక్కి సలహాను ఇవ్వడం లాంటి పనులు చేస్తారు. కొన్ని ప్రముఖ స్టాక్ brokerage సంస్థలు మనం ఎక్కడెక్కడ పెట్టుబడి చేస్తే లాభాలు వస్తాయో ఏ ఏ స్టాక్స్ కొంటె మంచి లాభం వస్తుందో ముందుగానే అన్ని రకాలుగా ఆలోచించి మనకి సలహాని ఇస్తారు. అయితే మనం ఇలాంటి వాళ్ళ Recommendations ని గుడ్డి గా follow అయ్యే బదులు దేని ఆధారంగా ఈ Recommendations ఇస్తున్నారో ఆ టెక్నిక్స్ నేర్చుకోడం శ్రేయస్కరం.

ఇప్పుడు ట్రేడింగ్ చేసుకోవటానికి  మార్కెట్ లో చాలా రకాలైన brokerage సంస్థల సాఫ్ట్ వేర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశలో stock trading చేసే వాళ్లకి ఇలాంటి సాఫ్ట్ వేర్స్ చాలా ఉపయోగకరం గా  ఉంటాయి.వాటిని డౌన్ లోడ్  చేసుకొని అవి సూచించే సూచనలను పూర్తిగా అవగాహన చేసుకుని ఆ పై  stock trading లోకి ప్రవేశించాలి. ఈ సాఫ్ట్ వేర్ లో ఉండే చార్ట్స్ సహాయంతో వాల్యూం ని ,ఎంత మంది ట్రేడింగ్ లో పాల్గొన్నారు,ఎంతమంది ఒక స్టాక్ ని కొంటున్నారు,ఎంత మంది అమ్ముతున్నారు ,ఏ ఏ కంపెనీ ల స్టాక్స్ ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుస్తాయి ,కాబట్టి వీటన్నిటిని బట్టి నిర్ణయం తగు జాగ్రత్తలు  తీసుకొని ట్రేడ్    చేయాల్సి ఉంటుంది

మొత్తం మీద చెప్పాలంటే సొంతంగా online స్టాక్ ట్రేడింగ్ అనేది కొద్దిగా క్లిష్టమైన పని. కాబట్టి చాలా జాగ్రత్తగా మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. మనం ట్రేడింగ్ చేసీ ముందు మన trading plan, entry, exit strategyలు ముందుగానే అలోచించి పెట్టుకోవాలి.

  • అన్నింటికన్నా ముందుగా మనం  ట్రేడ్ చేయడానికి మనకి  తగ్గట్లుగా ఉండే  ఒక అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి.
  • మనం ఎంత ఇన్వెస్ట్  చేయగలమో నిర్ణయించుకోవాలి.
  • ఒక ప్రణాళికా బద్ధం గా నడుచు కోవాలి.
  • తక్కువ బ్రోకరేజ్ ఉండే స్టాక్ brokerage సంస్థలు చూసుకోవాలి.
  • మనం ట్రేడ్ చేసుకోవడానికి లాగ్ ఆన్ అయ్యేటపుడు ఏమైనా ఇబ్బంది గా అనిపిస్తే ఆ brokerage సంస్థను ఎలా సంప్రతించాలో తెలుసుకోవాలి. సాధారణంగా చాల సంస్థలు సమస్యలను solve చేయడానికి online chat గాని email support గాని అందిస్తున్నాయి.
  • అలాగే ప్రారంభంలో మనం Stock Market గురించి ,Trading Techniques గురించి,దాని తీరు తెన్నుల గురించి తెలిసిన నిపుణుడి సలహాను తీసుకుంటే మంచిది .
  • ఎప్పటికప్పుడు మనం చేసిన, చేయబోయే కంపెనీ యొక్క క్వార్టర్  మరియు ఆన్యువల్ రిపోర్ట్స్ ని గమనిస్తుండాలి.

స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం చిన్న ebooks లాగా రూపొందించడం జరిగింది.  ఆసక్తి గలవారు క్రింది లింకుని click చేయవచ్చు.

http://bit.ly/2dyNxz2

swing trading report in telugu
swing trading report in telugu

 

 

(Visited 1,177 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *