Nifty ట్రెండుని నిర్ధారించే టూల్.

Optionల విశ్లేషణ ద్వారా ప్రస్తుత మార్కెట్ ట్రెండుని తెలుసుకోవడానికి కొంతమంది ట్రేడర్లు కొన్ని చిన్నచిన్న tools ని రూపొందించడం జరిగింది. అందులో ఒకటి Sourabh Gandhi రూపొందించిన Nifty trend finder based on option analysis tool.

చాలా సులువుగా నేర్చుకుని ఉపయోగించగలిగే టూల్ ఇది. దీని ద్వారా మార్కెట్ Direction ని తెలుసుకోవచ్చు..

Disclaimer: మార్కెట్లో లభించే ఏ టూల్ గానీ, ఏ software గానీ నూటికి నూరుశాతం ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం జరగదు. అందువల్ల ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సర్టిఫైడ్ ఆర్ధిక సలహాదారుల యొక్క సూచనలను పాటించడం అవసరం.

Method:

ముందుగా http://niftytrendfinder.pivottrading.net/ లోకి వెళ్ళండి. అక్కడ ఇలాంటి interface కనిపిస్తుంది.

screenshot

ఆరోజు nifty స్థాయిని (level) ఎంటర్ చేయండి. వెంటనే క్రింద రెండు బాక్సులు ఓపెన్ అవుతాయి.

మొదటిదానిలో ఇవ్వబడ్డ Call option యొక్క మార్కెట్ ధరనూ, రెండవ దానిలో ఇవ్వబడ్డ Put option యొక్క మార్కెట్ ధరనూ ఎంటర్ చేయండి.

screenshot_1 (Option ల మార్కెట్ ధరలు ఈ లింకులో లభిస్తాయి. http://securities.indiabulls.com/market/derivative/active_callsputs.aspx)

రెండు Optionల మార్కెట్ ధరలు ఎంటర్ చేయగానే మార్కెట్ trend ఏమిటో తెలపబడుతుంది.

screenshot_2 కొన్నిసార్లు పరీక్షించుకుని టూల్ సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకోవడం మంచిది.

 

(Visited 1,604 times, 3 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *