How to benefit from Mutual Funds? (in Telugu)

Mutual funds అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి?

సామాన్య ప్రజలు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును రకరకాల పద్దతుల్లో మదుపు (Invest) చేస్తారు. అందులో కొన్ని…

  • బంగారం
  • రియల్ ఎస్టేట్ (ప్లాట్లు, ఇళ్ళు)
  • షేర్లు (స్టాక్ మార్కెట్)
  • fixed deposits
  • చిట్ ఫండ్స్

ఇందులో కొన్ని మార్గాల్లో సంపద చాలా వేగంగా వృద్ధి చెందుతుండగా మరికొన్నింటిలో నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని రంగాలు సురక్షితమైనవి కాగా మరికొన్ని రిస్కీగా పరిగణింపబడతాయి. ఒక్కో ఇన్వెస్టర్ యొక్క రిస్కు తీసుకునే స్వభావాన్ని బట్టి, వారి ఆశను బట్టి వారికి నచ్చిన రంగాల్లో invest చేసుకునే అవకాశముంది.

అయితే స్టాక్ మార్కెట్ విషయాన్నే తీసుకుంటే Derivatives (Futures and Options) లాంటి అధిక రిస్కు ఉన్న విషయాలను పక్కనబెడితే, తక్కువ రిస్కు ఉండే ఈక్విటీలలో దీర్ఘకాలిక అవసరాల కోసం invest చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ మార్కెట్ గురించి అవగాహన లేకపోవడం, మట్టిలోమాణిక్యాల వంటి స్టాక్స్ ని వెతికి గుర్తించే నైపుణ్యం, సమయమూ లేకపోవడం వల్ల “ఇది మనవాళ్ళ అయ్యే పని కాదులే” అని మార్కెట్ కి దూరంగా ఉండిపోతారు. దానివల్ల వారికి అందుబాటులోనే ఉన్న ఎన్నో అద్బుతమైన అవకాశాలను కోల్పోయినవారవుతారు.

ఇలాంటివారి కోసమే ఏర్పడిన సంస్థలు mutual funds.

mutual funds లలో ఎవరైనా తమ వద్దనున్న సొమ్ముని invest చేయవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఈ mutual funds సంస్థలు రకరకాల మార్గాల్లో, రంగాలలో ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్నిసార్లు సురక్షితమైన రంగాలలో, కొన్నిసార్లు కాస్త రిస్కు ఉన్న రంగాలలో కూడా invest చేయడం జరుగుతుంది. ఎలాంటి రంగాలలో పెట్టుబడి పెడతారన్న విషయం ముందుగానే తెలపడం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన mutual fund నే ఎంచుకోవచ్చు.

ఇక ఈ funds నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి మంచి అవగాహన కలిగిన, అపార అనుభవం ఉన్న fund managers నే ఈ సంస్థలు నియమించుకోవడం జరుగుతుంది. Fund managers చేసే ఏ ఒక్క పొరపాటయినా కూడా సంస్థకి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రమాదముంది కాబట్టి mutual fund సంస్థలు ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా performance కలవారినే నియమించుకుంటాయి. ఈ fund managers నిరంతరం తమ Portfolio (మదుపు చేసిన అంశాలు/ stocks) ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, సమయాన్ని బట్టి తమవద్దనున్న stocks అమ్మేయడం, తిరిగి కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఇన్వెస్టర్ల సొమ్ముని పెట్టుబడిగా పెట్టి, వాటి ద్వారా వచ్చిన లాభాలలో కొంతవాటా ఇన్వెస్టర్లకి అందజేస్తూ, నిర్వహణ ఖర్చుల క్రింద తమవంతుగా ఈ fund managers కొంత స్వీకరించడం చేస్తాయి. ఇదీ fund managers చేసే పని.

1963లో యూనిట్ ట్రస్ట్ అఫ్ ఇండియా స్థాపన భారత దేశంలో mutual funds కి నాంది పలికింది. 1993లో ప్రైవేటు రంగ సంస్థలకి కూడా అనుమతి మంజూరు చేయడం జరిగింది. 2013 నాటికి దేశంలో ఉన్న mutual funds సంస్థల సంఖ్య 46. ఈ mutual funds ల వ్యాపారాన్ని SEBI (Securities and Exchange Board of India) నియంత్రిస్తుంది.

Mutual fund వల్ల ప్రయోజనాలు:

1.ఇందులో మీకు తోచిన మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. భారీస్థాయిలో సొమ్ము ఉంటేనే mutual fundలో పెట్టుబడికి అవకాశం ఉంటుందనేది ఒక పొరపాటు. మీవద్ద 500 రూపాయలు ఉన్నా కూడా mutual fundలో invest చేయవచ్చు.

2.ప్రొఫెషనల్ fund managerల సేవలు పొందవచ్చు: మంచి అనుభవం, నైపుణ్యంగల వీరు, qualified research team ని కలిగి ఉండి, ఎల్లప్పుడూ మంచి పెట్టుబడి అవకాశాలకోసం అన్వేషిస్తూ, మీ సొమ్ముని రెట్టింపు చేయడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మీ కష్టార్జితాన్ని ఎలా వృద్ధి చేయాలా అని మీరు బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీరి చేతుల్లో ఉంచి నిశ్చింతగా ఉండవచ్చు.

3.Diversification: సోమ్మునంతటినీ ఏదో ఒక్క రంగంలోనే పెట్టుబడిగా ఉంచితే దురదృష్టవశాత్తూ ఏదైనా అనుకోని  సంఘటన జరిగి ఆ రంగానికి దెబ్బ తగిలినట్లయితే ఇన్వెస్టర్ల కష్టార్జితమంతా ఆవిరయిపోయే ప్రమాదముంది అందుకే fund managerలు వేర్వేరు రంగాలలో invest చేయడానికి (diversification) అవకాశముంది. దీనివల్ల ఒక రంగంలో వచ్చిన నష్టాలను మరో రంగంలోని లాభాలతో కవర్ చేసే అవకాశముంది. Diversification అంటే ఇష్టంలేని ఇన్వెస్టర్లకి కోసం non-diversified funds కూడా లభిస్తున్నాయి, ఇక ఇన్వెస్టర్ల ఇష్టం, ఏదైనా ఎంచుకోవచ్చు.

4.సులభం: పదేపదే బ్రోకర్ కి phone చేయాల్సిరావడం ఉండదు. ప్రతీరోజూ పేపర్లో మీ stocks ధర పెరిగిందా తగ్గిందా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి invest చేస్తే మళ్ళీ బ్రోకర్ మొహం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ కంప్యూటర్ పై కూర్చుని ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనుంచే onlineలో mutual fundలో invest చేయవచ్చు. జస్ట్ మీ వద్ద మొబైల్ ఉంటే చాలు మీ mutual fund site కి వెళ్లి మీ పెట్టుబడి యొక్క ఆరోజు విలువ (NAV- Net Asset Value) తెలుసుకోవచ్చు. ఇది రెండు నిముషాల పని. ఒకవేళ మీ investment వృద్ధి చెందిన తరువాత ఇక చాలు అనుకుంటే వెంటనే అమ్మివేయవచ్చు. Net Asset Valueని బట్టి మీకు ఎంత సొమ్ము చెల్లించబడుతుందో సులభంగా చెప్పగలం.

మొత్తం మీద స్టాక్ మార్కెట్ పై సమగ్ర అవగాహన్ లేని ఓ సామాన్యుడికి invest చేయడానికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి ఈ mutual funds.

(Visited 3,087 times, 1 visits today)

8 thoughts on “How to benefit from Mutual Funds? (in Telugu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *