స్టాక్ మార్కెట్ లో Investing మొదలు పెట్టడం ఎలా?

 

మీరు ఎప్పుడైన స్టాక్ మార్కెట్ లో ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించే వారిని చూసి మీరు కూడా అలాగే సంపాదించాలనుకున్నారా? మీ సమాధానం అవును అయితే మీకు స్టాక్ మార్కెట్ గురించి మెళకువలు నేర్చుకోవాల్సిన ఆసక్తి ఉందనీ, ఆ సమయం ఆసన్నమైందని అర్థం.

స్టాక్ మార్కెట్ గురించి కనీస అవగాహన లేకుండా అందులోకి అడుగుపెట్టడం అనేది ఈత రాకుండా నీళ్లలో దూకడం లాంటిది. మనకు విద్య చాలా అవసరం. కానీ ఆ విద్య నేర్చుకోవడానికి ఎలాగైతే కొంత సమయం పడుతుందో, స్టాక్ మార్కెట్ గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది.

మరి ఆ అవగాహన ఏర్పరచుకోవడం ఎలా ?

                          అందుకు ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి  Internet. ఇంటర్నెట్ లో దొరకని సమాచారం అంటూ లేదు. Internet తో వచ్చిన ప్రమాదం ఏమిటంటే అవసరమైన దాని కంటే ఎక్కువ information లభించడం.వీనిలో నుండి చెత్తని ఏరివేసి మంచిని గుర్తించడానికి మన అమూల్యమైన సమయం ఎంతో వృధా అవుతుంది. ఇంటర్నెట్ లో బోలెడన్ని వెబ్సైట్లు “ఇ-లెర్నింగ్” విభాగం కింద స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల గురించి సమగ్ర సమాచారం అందిస్తున్నాయి. మనం చేయవలసిందల్ల ఆ website లో రిజిస్టర్ చేసుకోవడమే. ఒక సారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన సమాచారాన్ని చదువుకొని ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు.

అంతకు మించిన చక్కని మార్గం మరొకటి ఉంది.అదే “ఇన్వెస్టర్స్ క్లబ్“. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు ఈ clubని ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఏ మాత్రం అనుభవం లేని వాళ్ళు అయితే అనుభవజ్ఞులు ఉన్నబృందం లో సభ్యులు గా చేరడం ఉత్తమం. వారి అనుభవం అనేది అప్పుడప్పుడే మొదలుపెడుతున్న వారికి ఉపయోగపడుతుంది.

                               ఇలా వివిధ రకాల మార్గాల ద్వారా మనం తెలుసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే “స్టాక్” అనేది ఒక కంపెనీకి సంబంధించిన వాటాలలో ఒక భాగం అనీ, ఒక “స్టాక్” కలిగి ఉండడం అంటే, ఒక నిష్పత్తి ప్రకారం ఆ కంపెనీ లాభ నస్టాలలో కూడా వాటా కలిగి ఉండడం అనీ, ఎన్ని ఎక్కువ “స్టాక్స్” కలిగి ఉంటే అంత ఎక్కువ వాటా ఆ కంపెనీ లో కలిగి ఉండడం అనీ అర్థమౌతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ‘స్టాక్’, ‘షేర్’, ‘ఈక్విటీ’, ఇవి అన్నీ ఒకే అర్థాన్ని సూచిస్థాయి.

ఈ విధంగా ఒక అవగాహన అంటూ ఏర్పడిన తర్వాత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి:

1. RISK APPETITE :

Derivatives లో Day Trading చేసేవాళ్ళు Risk appetite అనే అంశాన్ని సరిగా అర్థం చేసుకుని అంతకు మించి పెట్టుబడిని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎంత డబ్బు నష్టపోతే మీరు బాధ పడకుండా ఉంటారో అదే మీ Risk appetite

“నా వద్ద ఉన్న రూ.1000 పోయినా పరవాలేదు అనుకుంటే ఆ రూ.1000 రిస్క్ ఆప్పేటైట్ అవుతుంది”.
2. GREED (దురాశ) :

                                    “Never be greedy with the markets”

మీరొక స్టాక్ ను రూ.100 కు కొన్న తర్వాత ఆ స్టాక్ రేటు రూ.150 కు చేరుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో కొన్నిటిని ఐనా అమ్మి వేసి ప్రాఫిట్ బుక్ (Profit Booking) చేసుకోవాలి. ఇంకా పెరుగుతుందేమో అన్న ఆశతో అమ్మకుండా ఉన్నట్లైతే ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
3. DIVERSIFICATION :

                                  “Never put all your eggs in one basket”

 పెట్టుబడి రంగాల్లో (స్టాక్ మార్కెట్,బంగారం, రియల్ ఎస్టేట్) దేనిలోనైనా సరే ఒకే రంగంలో మనం ఎక్కువ మొత్తం ఉంచడం సరైన పద్ధతి కాదు. అదే విధంగా స్టాక్ మార్కెట్ లో కూడా మన పెట్టుబడి అంతటినీ ఒకే సెక్టార్ లో కేంద్రీకరించaకుండా అన్నీ రంగాల మధ్య సమతూకం పాటించడం మంచిది.

 కొత్తగా వచ్చిన investors కి సాదారణంగా ఎదురయ్యే ప్రశ్నలు.

 • ఏ స్టాక్ కోనాలి ………?
 • ఏ స్టాక్ కొంటె తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి……….?
 • నా దగ్గరున్న స్టాక్స్ అమ్మడానికి ఇది సరియైన సమయమేనా? లేదా ఇంకొన్ని రోజులు ఆగాలా?
 • Market Expert సూచించిన స్టాక్స్ నే కొనుగోలు చేసినప్పటికీ, ఎందుకు ఆ షేర్ లు పడిపోతున్నాయి?
 • మంచి లాభాలనిచ్చే స్టాక్స్ ని గుర్తించడానికి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా?

ఈ ప్రశ్నలకి జవాబుల కోసం సాధారణంగా మదుపర్లు క్రింది వారిపై ఆధారపడతారు:

 • షేర్ మార్కెట్ గురించి తెలిసిన స్నేహితులు లేదా షేర్ బ్రోకర్లు.
 • TV లో నిపుణులు ఇచ్చే సలహాలు.
 • పత్రికలు,మాగజైన్లు.
 • Internet

ఇతరులు చెప్పిన స్టాక్క్స్ కొంటూ ఉంటే మనం ఎప్పటికీ కూడా వారి సలహాలు పాటించే వారిగా మిగిలిపోతామే తప్ప స్వతంత్రంగా వ్యవహరించే తెలివైన ఇన్వెస్టర్ గా ఎడగలేము. మార్కెట్ లో ప్రవేశించిన కొత్తలో కొంతమటుకు ఇతరులపై ఆధారపడినా కూడా , ఎంత త్వరగా మన జ్ఞానాన్ని పెంచుకుంటే అంతా మంచిది. “Do not give them fishes , but teach them how to fish” అనేది ఒక సామెత. దీనిని ఎల్లప్పుడు గుర్తు పెట్టుకుంటే మంచిది.

 

      స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం చిన్న ebooks లాగా రూపొందించడం జరిగింది.

              ఆసక్తి గలవారు క్రింది లింకుని click చేయవచ్చు.

                              http://bit.ly/2dyNxz2

 

swing trading report in telugu

 

(Visited 7,204 times, 1 visits today)

14 thoughts on “స్టాక్ మార్కెట్ లో Investing మొదలు పెట్టడం ఎలా?

 1. through this information i got some knowledge about share market thanks.
  give me some more information about investment. i am layman to share market.

 2. Stock investment New started. I have trading account in sbi. So how to start buying and selling plz guide to me. thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *