స్టాక్ మార్కెట్ లో లాభాలను ఇచ్చే స్టాక్ ని కనుక్కోవడం ఎలా?

లాభాల్ని ఇచే స్టాక్ ని కనుక్కోవడం ఎలా?

స్టాక్ మార్కెట్ లో ఏది లాభాల్ని ఇస్తుంది , దేని వల్ల నష్టం వస్తుంది అని   కనుక్కోవడం చాల కష్టం.

కాని కొన్ని జాగ్రతలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను  అధిగమించవచ్చు.

  • కంపెనీ యొక్క ఆర్ధిక లావాదేవీలు ఎప్పుడు ఒకేలా ఉండవు.ఒక్కొక్కసారి లాభాల్లో ఉండే కంపెనీ నష్టాల్లోకి వెళ్తుంది.తిరిగి లాభాల్లోకి వస్తుంది.ఇలాంటి సమయం లో కంపనీ షేర్ రేట్ తగ్గినపుడు కొనిపెట్టుకోవాలి.తిరిగి లాభాల్లోకి వచినపుడు ఆ షేర్ రేట్ పెరిగి మనకి లాభం చేకూరుతుంది.దీనికి ఉదాహరణగా SAIL కంపెనీని చెప్పుకోవచ్చు.ఇది నష్టాల్లో ఉన్నప్పడు షేర్ రేట్ 6 rs.తర్వాత లాభాల్లోకి వచ్చాక రేట్ 55 rs.
  • కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కంపెనీ లు కలిసి ఒకే కంపెనీ గా ఆవిర్భావిస్తాయి. వీటిని mergers and acquisitions అంటారు. అలాంటి సమయాల్లో మనం ఆ కంపనీ షేర్ కొన్నట్లయితే ఎక్కువ లాభం వస్తుంది.అయితే దీనిని గురించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవాలి.
  • ప్రభుత్వ విధానాలను మార్చడం వల్ల కూడా స్టాక్ మార్కెట్ లో ప్రభావం కనిపిస్తుంది. ఏ కంపని ఐతే ప్రభుత్వ విధానాలకు లోబడి వృద్ధి చూపిస్తుందో  ఆ కంపనీ యొక్క షేర్ రేట్ త్వరగా పెరుగుతుంది.కాని కొన్ని సార్లు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలవల్ల కూడా కంపెనీ లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది.అలాంటి సమయాలలో మనం ముందు చూపుతో ఏ ఏ షేర్స్ రేట్లు తగ్గుతాయో గమనించి అవి రేట్ తగ్గక ముందే వాటిని అమ్మ్మి వేయడం మంచిది.ఉదాహరణకు పన్నులను పెంచడం ,తగ్గించడం లాంటి నిర్ణయాలవల్ల కూడా మారుతుంది.
  • టెక్నలాజికల్ గా ఏ కంపనీ ఐతే ముందు ఉంటుందో ఆ కంపెనీ స్టాక్స్ కూడా లాభంగా ఉంటాయి . ఉదాహరణకు I.T కంపెనీలు,బయోటెక్నాలజీ కంపెనీ లు etc.

  • భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందుగానే ఊహించడం వల్ల కూడా మంచి జరుగుతుంది.దీనికి మనం చేయవలసినిది మన చుట్టూ ఏమి జరుగుతుంది అనేదానిమీద చూడటమే.ఏ ఏ కంపెనీలు ఏ ఏ స్థితి లో ఉన్నాయో గమనిస్తూ ఉండాలి. ఆ కంపనీ ల లాభ నష్టాలకి కారణం ఏంటి అని అన్వేషిస్తూ ఉండాలి.
  • ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో గమనిస్తుండాలి.అంతర్జాతీయంగా ఆర్ధిక లావాదేవీలు ఎలా ఉన్నాయో వాటి ప్రభావం మన దేశం లో ఎలా ఉందో,మనం కొన్న కంపెనీ షేర్ల మీద వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో గమనిస్తూ ఉండాలి.ఉదాహరణకి WTO ఒప్పందం వల్ల మన దేశం లోని ఫార్మా,టెక్స్ట్ టైల్,IT రంగాలకి మంచి పురోగతి లభించింది.
 • కొత్త కొత్త గా ఏ ఏ కంపెనీ లు ప్రారంభిస్తున్నారో ముందుగా తెలుసుకొని దాని స్టాక్స్  కొని పెట్టుకోవడం మంచిది.  వీటినే సన్ రైజ్  ఇండస్ట్రీస్ అంటారు.ఉదాహరణకి 1960 లో వచ్చిన కంపెనీలు ,స్కూటర్,టెక్స్టైల్ ,హోటల్ బ్రాంచెస్ .ఇప్పుడు 21 వ శతాబ్దం లో కంపూటర్ ,సాఫ్ట్ వేర్ కంపనీ లు ,టేక్నోలోజికల్,ఆయిల్ ….ఇలా చాలా చాలా కంపెనీలు ఆవిర్భవించాయి.ఇలాంటి సమయం లోనే మొదటే షేర్స్ కొనిపెట్టుకుంటే వాటి రేట్ కూడా కంపెనీ అభి వృద్ధి తో పాటే పెరుగుతాయి.
 • ఎప్పుడైతే ఒక కంపెనీ టేక్ ఓవర్ చేయగలుగుతుందో ఆ కంపెనీ షేర్ రేట్ పెరుగుతుంది.ఆ కంపెనీ యొక్క యాజమాన్యాన్ని కూడా మార్చి   కొత్త యాజమాన్యాన్ని ఏర్పరచుకోడం వల్ల కూడా ధర పెరుగుతుంది.ఎప్పుడైతే  కంపెనీ టేక్ ఓవర్ చేస్తుందో అప్పుడే దానంతట అదే కంపెనీ యొక్క షేర్ రేట్ పెరుగుతుంది.
 • ఇక్కడ ఇన్వెస్టర్స్ అభివృద్ధి కి మరియు వేల్యూ ఇన్వెస్టింగ్ కి తేడా ని కనుక్కోవాలి.ఒక కంపెనీ దాని సగటు అభివృద్ధి కన్నా ఎక్కువ అభివృద్ధి తో ఉన్నప్పుడు మనం ముందు చూపుతో ఎక్కువ రేట్ అయినా ముందుగా కొనిపెట్టుకోవాలి.అప్పుడు కంపెనీ రేట్తోపాటు  మన షేర్ రేట్ కూడా   పెరుగుతుంది.
 • ఇక వేల్యూ ఇన్వెస్టింగ్ {value investing} విషయానికి వస్తే ఇక్కడ కంపెనీ యొక్క స్టాక్ రేట్ ఆ కంపెనీ యొక్క అభివృద్ధి ఫై ఆధార పడి ఉంటుంది,ఇక్కడ స్టాక్ కి రేట్ నిర్ణయించ బడటం అనేది ఒక ముఖ్య కారకం గా చెప్పుకోవచ్చు.వాల్యూ ఇన్వెస్టింగ్ షేర్ ధర  అనేది ఆ కంపెనీ యొక్క గత ఆర్ధిక లావాదేవీల మీద  మరియు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి  ఉంటుంది.
 • ఐతే వాల్యూ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది ఎప్పుడు లాభదాయకంగా ఉండేలాగా చూసుకోవాలి {margin అఫ్ safety}.
 • ప్రతి ఒక్కరు కొంటున్నారుకదా అని కొనకూడదు.దానికి తగిన సమయం చూసి కొనాలి .పెద్ద కంపెనీల స్టాక్స్ ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు చూసి కొనడం మంచిది.పెద్ద కంపెనీల స్టాక్స్ ఈ క్రింది కారణాలవల్ల తగ్గడం జరుగుతుంది.

a.స్టాక్ మార్కెట్ లో నష్టం రావడం వల్ల.

b.కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడం వల్ల.

c.ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉండక పోవడం వల్ల

d. స్టాక్ కి బ్రాండ్ ఇమేజ్ లేక పోవడం వల్ల

e. స్టాక్ ని ఇన్వెస్టర్స్ గమనించకపోవడం  వల్ల.etc…

 • ఏ స్టాక్ ఐతే ఎక్కువ మందిని ఆకర్షించదో దానిని కొనడం మంచిది.ఐతే ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ని తెలుసుకొని కొనాలి.ఎక్కువ మందిని ఆకర్షించే స్టాక్ అది తక్కువ రేట్ లో ఉన్న కాని ఎక్కువమంది కొనడానికి ఇష్టపడటం వల్ల దాని రేట్ అమాంతం పెరిగిపోతుంది.అందువల్ల ఒక స్టాక్ రేట్ యొక్క ఫండమెంటల్స్ ని తెలుసుకొని దానిని ఎక్కువమంది కొనక పోయిన ముందు చూపుతో కొనడం మంచిది.
 • ఏ కంపెనీలు అయితే మోనోపోలీ వ్యాపారాలను చేస్తున్నాయో అవి వాటి సేల్స్ ని కానీ షేర్స్ ని కాని కోనే వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోతాయో ,వేటి టర్నోవర్ పెరుగుతుందో వాటి షేర్స్ ని కొనుక్కోవాలి.ఉదాహరణకు apple I phone కంపెనీ, మైక్రోసాఫ్ట్,kfc,airbus ౩౮౦,cocacola etc..ఇలాంటి కంపెనీలు మిగతావాటికి దీటుగా నిలబడి వాటి సేల్స్ ని రెట్టింపు చేసుకొని ముందుకు వెళ్తున్నాయి.ఇల్లాంటి కంపెనీల షేర్స్ కొండం దీర్గకాలికంగా ఎంతో లాభం.
 • మనం కొనే ఏ మంచి స్టాక్ అయిన  కనీసం  దీర్ఘకలికంగా అంటే 5 నుండి 10 సంవత్సరాల వరకు అయిన ఉండేలాగా చూసుకోవాలి.అప్పుడే మనకి మంచి లాభం వస్తుంది.
 • స్టాక్ ని ఎంచుకోవడం లో P/E నిష్పత్తి చాల విలువైనది.తక్కువ P/E నిష్పతి ఉండే స్టాక్స్ ని కొనాలి.
 • P/E నిష్పత్తి అంటే ప్రైస్  ఎర్నింగ్ {price earning ratio}.

PE = MARKETPRICE/EPS          EPS=EARNING PER SHARE

 • కాని ఎప్పుడు P/E నిష్పత్తి మీదే ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే  ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇది అమాంతము పెరగను వచ్చు ,తగ్గనూ వచ్చు.ఇది కేవలం ఒక సూచికలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కాని కంపెనీ యొక్క స్థితి గతులను చూసి  ఇన్వెస్ట్ చేయడం మంచిది.
 • బుక్ వేల్యూ అనేది కూడా షేర్స్ ని కొనడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.దీనిని book value of equity per share [BVPS ] గా పరిగనణిస్తారు.

BVP= వేల్యూ అఫ్ కామన్ ఈక్విటీ/నెంబర్ అఫ్ షేర్స్ ఔట్ స్టాండింగ్.

 • అంటే bvp అనేది కంపెనీ షేర్ రేట్ ని నిర్దేశిస్తుంది. ఈ BVP ని బట్టి షేర్ రేట్ తక్కువలో ఉందా లేదా అనే దానిని గురించి తెలుసుకోవచ్చు.ఐతే ఇది ప్రస్తుతం మార్కెట్ లో జరిగే షేర్ ని మాత్రమే నిర్దేసిన్చాగలదు.భవిష్యత్తులో  ఎలా ఉండబోతుందో చెప్పలేము.


కాబట్టి ఏది ఏమైనా కాని షేర్ మర్కెట్ లో ఇన్వెస్ట్ చేసే టప్పుడు అన్నివిధాలుగా గమనిస్తూ ఆచితూచి అడుగెయ్యాలి.నష్టాలు వచ్చినపుడు  కృంగిపోకుండా  ధైర్యంగా జాగ్రతగా  ఆలోచించి డబ్బు invest చేయాలి.

స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం చిన్న ebooks లాగా రూపొందించడం జరిగింది. ఆసక్తి గలవారు క్రింది లింకుని click చేయవచ్చు.

http://bit.ly/2dyNxz2

(Visited 1,515 times, 1 visits today)

3 thoughts on “స్టాక్ మార్కెట్ లో లాభాలను ఇచ్చే స్టాక్ ని కనుక్కోవడం ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *