స్టాక్ మార్కెట్ లో సాధారణంగా ఇన్వెస్టర్స్ చేసే పొరపాట్లు

                         

Retirement తరువాత సుఖవంతమైన జీవితం కొరకు లేదా తక్కువ సమయం లో పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించాలన్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి పధ్ధతి. అయితే  ఎటువంటి శ్రమ లేకుండా సులువుగా ( easy money ) డబ్బు సంపాదించే పధ్ధతి మాత్రం కాదు.

  ఈ ఆర్టికల్ లో సాధారణం గా ఇన్వెస్టర్స్ చేసే పొరపాట్లు ,అవి చేయకుండా ఉండడానికి జాగ్రత్తలు వివరించడం జరిగింది.

1. అప్పు చేసి invest/ట్రేడ్ చేయడం:

మీరేపుడైనా casino కి వెళ్ళారా?

కనీసం పేకాట ఆడేటప్పుడు చూసారా?

ఎందుకంటే కాసినో లో కాని పేకాట లో కాని ఓడిపోయేటప్పుడు ఆ వ్యక్తి భావోద్వేగాలని గమనిస్తే ఓటమిని అంగీకరించకుండా ,ఉక్రోషము తో పోయిన చోటే వెతుక్కోవాలన్న తపన తో అప్పు తీసుకోని మరీ అట మొదలు పెడతారు. ఫలితం ఉన్న డబ్బు కి తోడూ ,అప్పు తీసుకున్న  డబ్బు కూడా నష్టపోవడం జరుగుతుంది.

ప్రథమ సూత్రం : ఎప్పుడు కూడా అప్పు చేసి investing/trading చేయకూడదు.

 ఒక వ్యక్తీ ఒంటరిగా ఉన్నప్పుడు ఓటమిని అంగీకరించే విధానం, గుంపు లో ఉన్నప్పుడు వ్యవహరించే పధ్ధతి భిన్నంగా ఉంటాయి. Online ట్రేడింగ్ విధానం లేనప్పుడు ప్రతి ఇన్వెస్టర్ నేరుగా స్టాక్ బ్రోకర్ ఆఫీస్ కి వెళ్లి గాని, లేదా phone ద్వారా గాని ట్రేడింగ్ చేయాల్సి వచ్చేది. స్టాక్ బ్రోకర్ ఆఫీస్ లో చాల మంది  ఇతర ఇన్వెస్టర్ లు, ట్రేడర్ లు మన లాభ నష్టాలను గమనిస్తుంటారు. మరికొందరు కామెంట్ కూడా చేస్తుంటారు. ఈ సందర్భంలో మన ego దెబ్బతినడం, తద్వారా నష్టాలను పూడ్చుకోవడానికి అప్పు చేసి మరీ ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. కాని ప్రస్తుత కాలంలో ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అది

  • Online స్టాక్  ట్రేడింగ్
  • Telephone ట్రేడింగ్

 కాబట్టి అన్నింటికన్నా ముఖ్యమైన  విషయం ఏమిటంటే అప్పు చేసిన డబ్బుతో ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదు.

2. సరైన ప్రణాళిక లేకుండా ఇన్వెస్ట్ చేయడం:

ఇది ఇన్వెస్టర్లు చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు.

ప్రణాళిక అంటే ఏమిటి?

  • మీరొక దీర్ఘకాలిక ఇన్వేస్టరా లేక స్వల్పకాల ట్రేడరా?
  • మీ లక్ష్యాలు ఏమిటి?
  • నెలనెలా రాబడి రావడమా లేక తక్కువ ధరకి స్టాక్స్ ని కొని స్వల్ప కాలం లో ఎక్కువ ధరకి అమ్మడమా?
  • మీకంటూ స్టాక్ మార్కెట్ ఫై అవగాహన ఉందా లేక మార్కెట్ ఎక్స్పర్ట్స్, బ్రోకర్స్ యొక్క రికమెండేషన్స్ ఫై ఆధార పడతారా?
  • మార్కెట్ ఫై మీరు అవగాహనను పెంచుకోవడానికి ప్రతీ రోజు ఏమి చేస్తున్నారు?

      పై ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం ద్వారా మీ planning పట్లే మీకు ఒక అవగాహన వస్తుంది. మీ లక్ష్యం ఏమిటో తెలిస్తేనే ఏ మార్గం ద్వారా వెళ్ళాలో  మీకు అర్ధమవుతుంది.మీ లక్ష్యం మీకు తెలియనపుడు వెళ్ళాల్సిన మార్గం గురించి అవగాహన సున్నా.

3. హేతుబద్ధం కాని లక్ష్యాలు: (Unreasonable Targets)

                 మీ లక్ష్యాలు నిజంగా సహేతుకంగా ఉన్నాయా? అవి సాధించదగినవేనా? మీ నిజమైన లక్ష్యం రాబోయే 30 సంవత్సరాలలో అపరిమితమైన సంపదను సంపాదించడం గనుక అయినట్లయితే మీ లక్ష్యాలు దీర్ఘకాలికమైనవై ఉండాలి.

4. రిస్క్ అంటే భయపడటం :

 over confidenceకీ, calculated రిస్క్ తీసుకోవడానికీ మధ్య తేడా చాలా స్వల్పం. చాలా మంది ఈ రెంటిని ఒకే గాటన కట్టేసే ప్రమాదం ఉంది కాని ఈ రెండింటి మధ్య స్వల్పమైన తేడా ఉంది .

         over confidence అనేది ఉండకూడనిది

         calculated  రిస్క్ అనేది సందర్భాన్ని బట్టి అవసరం .

ఇతరుల నుండి వడ్డీకి డబ్బు అప్పుగా  తీసుకొని, స్టాక్ మార్కెట్ లో speculation చేయడం లేక పెన్ని స్టాక్ లో మదుపు చేసి రెండు వారాల్లో ఆ డబ్బు రెట్టింపు అవుతుందని పెట్టుబడి పెట్టడం అనేది over confidence.

అయితే రిటైర్మెంట్ సమయం లో పెట్టుబడి కరిగి పోకుండా సురక్షితం గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి, కాని 30 – 45 మధ్య వయస్సు లో కాస్తంత రిస్క్ తీసుకోవడం మంచిది. ఈ కాస్తంత రిస్క్ కూడా Overconfidence కాకుండా calculated రిస్క్ మాత్రమే అయి ఉండాలి.

ఇన్వెస్టింగ్ విషయం లో ఒక మంచి సలహా ఏమిటంటే మార్కెట్ crash సమయం లో అందరు భయపడి ఆందోళనలో స్టాక్స్ ని అమ్ముతున్నప్పుడు వాటిని కొనుగోలు చేయడం. మనకు తెలిసో ,తెలియకో TV లో కనిపించే market ఎక్స్పర్ట్స్ యొక్క, బ్రోకర్ ల యొక్క సలహాలను పాటిస్తాము. అయితే వారి సూచనలను  గమనించడంలో తప్పేమీ లేనప్పటికీ, మనకంటూ ఒక అభిప్రాయం, అంచనా లేకపోవడం సరైనది కాదు.

 మనకి లభించిన సలహాలను మన స్వంత పరిశోధనతో సరిపోల్చుకొని సంతృప్తి చెందిన తర్వాతే స్టాక్స్ ని కొనుగోలు చేయాలి.

Market Crash సమయం లో మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కూడాతక్కువ ధరకే లభిస్తాయి.ఈ మట్టిలో మాణిక్యాలను గుర్తించి  కొనుగోలు చేయడం శ్రేయస్కరం.

Market పతనం ప్రారంభమైనప్పటి నుండి rock bottom( అతి క్రింది స్థాయికి ) చేరే వరకు ఎదురు చూడకుండా దశల వారిగా స్టాక్స్ ని కొనుగోలు చేయడం సరైన పధ్ధతి. ఎందుకంటే మార్కెట్ యొక్క bottom ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలీయదు కాబట్టి markets ఏ నిమిషంలో నైనా bounce back అయి up trend లోకి వెళ్ళే అవకాశం ఉంది.

స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం చిన్న ebooks లాగా రూపొందించడం జరిగింది. ఆసక్తి గలవారు క్రింది లింకుని click చేయవచ్చు.

http://bit.ly/2dyNxz2

swing trading report in telugu

 

(Visited 3,873 times, 1 visits today)

5 thoughts on “స్టాక్ మార్కెట్ లో సాధారణంగా ఇన్వెస్టర్స్ చేసే పొరపాట్లు

  1. Sir, I want to analyze the shares and pick good scrip. For this what I have to do. I have been investing in shares for 9 years . Now I am not working. Please advise me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *