Fundamental Analysis ద్వారా లాభదాయకమైన షేర్లను గుర్తించడం ఎలా?


స్టాక్ మార్కెట్ లో కి కొత్తగా ప్రవేశించిన ఇన్వెస్టర్ల కి మార్కెట్ కి సంభందించిన పదాలు [Jargon] చాలా కొత్తగా, విచిత్రం గా అనిపిస్తాయి. ఈ మార్కెట్ పదకొశాలలో రెండు అతి ముఖ్యమైన పదాలు.

1. Fundamental analysis

2. Technical analysis.

 ఒక స్కూల్ కి వెళ్ళే పిల్లవాడికి కూడా అర్ధం అయ్యే విషయం ఏమిటంటే స్టాక్ మార్కెట్ లో ఏ స్టాక్ ధర అయితే పెరుగుతుందో మనం ముందే గ్రహించగలిగితే మన పంట పండినట్లే.

కాని అలాంటి స్టాక్స్ ని గుర్తించే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా ?

నూటికి నూరుపాళ్ళు విజయం సాధించే టెక్నిక్ అయితే ఏదీ లేదు. కానీ కొంతమటుకు ఈ విషయం లో పైన చెప్పుకున్న రెండూ( Fundamental analysis, Technical analysis ) సహాయం చేస్తాయి.

Technical analysis, ఒక స్టాక్ యొక్క గత చరిత్ర ,గత price movements ఆధారంగా, భవిష్యత్తులో దాని ధరను ఊహించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ స్టాక్ uptrend లో ఉండబోతుందా లేక downtrend  లో కి వెళ్ళబోతుందా అని ఊహిస్తుంది.

Read More

6 ముఖ్యమైన స్టాక్ మార్కెట్ వ్యూహాలు

స్టాక్  మార్కెట్  వ్యూహాలు:
 ఏదో లాటరిలో 10 రూపాయలకు టికెట్ కొని దానికి లక్ష రూపాయల బహుమతి వచ్చేలా చేయమని దేవుని ప్రార్థించినట్లు కాకుండా కొంత తెలివి మరియు శ్రమతో మార్కెట్ లో తప్పకుండా లాభాలు ఆర్జించవచ్చు. 

దీనికోసం అవసరమైన కొన్ని వ్యూహాలు ఈ వ్యాసంలో తెలుపబడ్డాయి.

1. Buy అండ్ Hold వ్యూహం : ఇదొక దీర్ఘ కాలిక విధానం. ఎంతో సురక్షితమైనది. నూటికి నూరు శాతమ విజయవంతమయ్యే అవకాశాలున్నది.  భిన్న రంగాలనుండి మంచి ఫండమెంటల్స్ ఉన్న బ్లూ చిప్స్ స్టాక్స్ ని కొన్నింటిని ఎన్నుకొని వాటిని కొనుగోలు చేయాలి.  కొన్న తర్వాత ప్రతిరోజూ వాటి ధరలు గమనిస్తూ పెరిగినపుడు “అబ్బో  త్వరగా పెరిగిందే అమ్మేస్తే పోలా” అనీ, ధర తగ్గినపుడు “అమ్మో  నష్ట మొచ్చిందే …మరింత తగ్గక ముందే అమ్మేస్తే మంచిది”  అనీ అనుకోకుండా, వాటి గురించి మరచిపోయి, ఎప్పుడైనా  మార్కెట్ కృంగినపుడు  తక్కువ  ధరకి మరిన్ని స్టాక్స్  కొనుగోలు చేయడం ఈ పద్దతిలోని  ముఖ్య సూత్రం.

Read More

స్టాక్ మార్కెట్ లో సాధారణంగా ఇన్వెస్టర్స్ చేసే పొరపాట్లు

                         

Retirement తరువాత సుఖవంతమైన జీవితం కొరకు లేదా తక్కువ సమయం లో పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించాలన్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి పధ్ధతి. అయితే  ఎటువంటి శ్రమ లేకుండా సులువుగా ( easy money ) డబ్బు సంపాదించే పధ్ధతి మాత్రం కాదు.

  ఈ ఆర్టికల్ లో సాధారణం గా ఇన్వెస్టర్స్ చేసే పొరపాట్లు ,అవి చేయకుండా ఉండడానికి జాగ్రత్తలు వివరించడం జరిగింది.

1. అప్పు చేసి invest/ట్రేడ్ చేయడం:

మీరేపుడైనా casino కి వెళ్ళారా?

కనీసం పేకాట ఆడేటప్పుడు చూసారా?

ఎందుకంటే కాసినో లో కాని పేకాట లో కాని ఓడిపోయేటప్పుడు ఆ వ్యక్తి భావోద్వేగాలని గమనిస్తే ఓటమిని అంగీకరించకుండా ,ఉక్రోషము తో పోయిన చోటే వెతుక్కోవాలన్న తపన తో అప్పు తీసుకోని మరీ అట మొదలు పెడతారు. ఫలితం ఉన్న డబ్బు కి తోడూ ,అప్పు తీసుకున్న  డబ్బు కూడా నష్టపోవడం జరుగుతుంది.

Read More

స్టాక్ మార్కెట్ ల పతనానికి ప్రధాన కారణాలు

స్టాక్ మార్కెట్ పతనం అంటే ఏమిటి?

సాధారణం గా ఒక Bull Run తర్వాత స్టాక్స్ విలువలు వాటి నిజమైన విలువకు అనేక రెట్లు పెరుగుతాయి.ఈ దశలో అకస్మాత్తుగా కానీ ,లేక క్రమ క్రమం గా కాని సూచీలు (Nifty ,Sensex) పడిపోవడం జరుగుతుంది.ఇదే స్టాక్ మార్కెట్ పతనం .

స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు:

1. అధిక ధరలు: Bull run లో స్టాక్ ధరలను ఎన్నో రెట్లకు మించి ఇన్వెస్టర్లు ఖరీదు చేస్తారు. అంటే వాటి అసలైన విలువకు ఎన్నో రేట్లకు మించి కొనడం వల్ల స్టాక్ ల P/E నిష్పత్తి {price earning ratio} అత్యధిక మొత్తాలకు చేరుతుంది. అత్యధిక P/E విలువల వద్ద మార్కెట్ ఒక నీటి బుడగలా మారి ఒక చిన్న negative అంశం వల్ల కూడా పతనం అయ్యే అవకాశం ఉంటుంది.

2. రాజకీయ అస్థిరత్వం: స్థిరమైన ప్రభుత్వం స్టాక్ మార్కెట్ లో bull run కి మంచి ఊపుని ఇస్తుంది.దీనికి భిన్నం గా అస్థిరమైన మైనారిటీ ప్రభుత్వం,hung parliament లు మార్కెట్ అనిశ్చితికి తోడ్పడి సూచీలు పతనమయ్యేలా తోడ్పడుతాయి . అంతేగాక ఉగ్రవాద చర్యలు ,సునామి,భూకంపం,వర్షాల లేమి,వరదలు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు కూడా మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని Hollywood సినిమాల్లో స్టాక్ మార్కెట్ ను పడగొట్టి కోట్లు సంపాదించేలా ప్లాన్ వేసిన విలన్ దాని కోసం ఉగ్రవాద చర్యలకు పాల్పడటం కూడా గమనించవచ్చు.

Read More

Online Stock Trading Tips Telugu.

Online Stock Trading:

చాలా సంవత్సరాల క్రితం ట్రేడింగ్ చేయాలి అంటే మార్కెట్ ఫ్లోర్ (stock broker’s office)దగ్గరకి వెళ్లి చేయాల్సి వచ్చేది. మనం అక్కడకి వెళ్ళకపోతే చేయలేక పోయేవాళ్ళం.కాని ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మనం ఇంట్లో నుంచయిన ,ఆఫీస్ నుంచి అయిన ఎక్కడినుంచి అయినా సరే ఇంటర్నెట్ ఉంటె చాలు ట్రేడ్ చేసుకోవచ్చు.

ఎన్నో విప్లవాత్మక మార్పులు తర్వాత ఇంటర్నెట్ లో  ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ మొదలైంది.ఈ స్టాక్ మార్కెట్ అనేది ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి కూడా చేయగలిగే స్థితి లో ఉంది.దీనిలో పెట్టుబడిదారులు ఇంటర్నెట్ లోని టేక్నాలజి ద్వారా ఎక్కడి నుండయినా Market Trading Hours లో మనకి అవసరమైన మైన స్టాక్ ని ట్రేడ్ చేసుకోవచ్చు.కేవలం ఒకే ఒక క్లిక్ తో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల లావా దేవిలు జరుగుతున్నాయి. అంతలా పెరిగి పోయింది టెక్నాలజీ.

Read More