Category Archives: Stock market Tips

Penny Stocks: లాభాలు, నష్టాలు.

Penny Stocks: Advantages, Disadvantages (in Telugu).

అతితక్కువ షేర్ ధర కలిగి ఉండి, అతి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిఉన్న షేర్లను పెన్నీ స్టాక్స్ అనవచ్చు. భారత దేశంలో 5 పైసల నుండి మొదలుకొని పది రూపాయల వరకూ ధర కలిగిఉన్న stocks ని పెన్నీ stocks అనడం జరుగుతున్నది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్లలోపు ఉన్నాకూడా పెన్నీ stocks అనడం జరుగుతున్నది. అదే అమెరికాలో ఒక డాలర్ కన్నా తక్కువ ధర కలిగిన షేర్లను పెన్నీ stocks అంటారు.

పెన్నీ స్టాక్స్ అన్నీ highly speculative.

అంటే ఒక్కసారిగా పైకి పరిగెట్టడంతో పాటు అంతే వేగంగా అకస్మాత్తుగా నేలకూలే ప్రమాదముంది. ఈ పెన్నీ stocks ఎంతో రిస్కుతో కూడుకున్నవి. ఎంత రిస్కునైనా భరించగలమని అనుకునేవారికి మాత్రమే ఇవి తగినవి. అయితే ఇవి ఇచ్చే లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి. ఈ షేర్లు ఒక్కరోజులోనే 20% వరకూ పెరగగలవు.

Read More

What is Sensex, Nifty in Telugu?

Sensex, Nifty meaning in Telugu

మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారితోపాటు లేనివారు కూడా టీవీల్లో, పత్రికల్లో sensex, Nifty లాంటి పదాలను గురించి వినే ఉంటారు. అసలీ పదాల అర్థం ఏమిటి అన్న సందేహం మనలో చాలామందికి వొచ్చే వుంటుంది.

స్టాక్ మార్కెట్లోని అనేక సెక్టార్లలో, కొన్నివేల చిన్నా పెద్దా stocks ప్రతీరోజూ ట్రేడ్ అవుతూ ఉంటాయి. మీరొక స్టాక్ లో invest చేయదలుచుకున్నప్పుడు కలగూరగంపలా ఉండే దీంట్లోంచి ఆ ఒక్క స్టాక్ ను వెతికి పట్టుకోవడం తలకి మించిన భారంగా అనిపిస్తుంది. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది.

మీ ముందర ఓ రెండు మొబైల్ ఫోన్లు ఉంచి, అందులోనుంచి ఒకటి ఎంచుకోమంటే మీ పని ఎంతో ఈజీ అవుతుంది కదూ! ఆ రెంటి ఫీచర్స్ ని పోల్చి చూసి (Google ఉపయోగించి) మీకు అవసరమున్నదానిని తీసుకోవచ్చు. ఇది రెండు నిముషాల పని . కాని ఓ పెద్ద మొబైల్ షో రూమ్ కి మిమ్మల్ని తీసుకెళ్ళి కొన్ని వందల మోడళ్ళనుండి, ఫలానా budgetలో ఓ ఫోన్ ని సెలెక్ట్ చేయమన్నప్పుడు మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది.

Read More

Nifty ట్రెండుని నిర్ధారించే టూల్.

Optionల విశ్లేషణ ద్వారా ప్రస్తుత మార్కెట్ ట్రెండుని తెలుసుకోవడానికి కొంతమంది ట్రేడర్లు కొన్ని చిన్నచిన్న tools ని రూపొందించడం జరిగింది. అందులో ఒకటి Sourabh Gandhi రూపొందించిన Nifty trend finder based on option analysis tool.

చాలా సులువుగా నేర్చుకుని ఉపయోగించగలిగే టూల్ ఇది. దీని ద్వారా మార్కెట్ Direction ని తెలుసుకోవచ్చు..

Disclaimer: మార్కెట్లో లభించే ఏ టూల్ గానీ, ఏ software గానీ నూటికి నూరుశాతం ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం జరగదు. అందువల్ల ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సర్టిఫైడ్ ఆర్ధిక సలహాదారుల యొక్క సూచనలను పాటించడం అవసరం.

Method:

ముందుగా http://niftytrendfinder.pivottrading.net/ లోకి వెళ్ళండి. అక్కడ ఇలాంటి interface కనిపిస్తుంది.

screenshot

ఆరోజు nifty స్థాయిని (level) ఎంటర్ చేయండి. వెంటనే క్రింద రెండు బాక్సులు ఓపెన్ అవుతాయి.

Read More

స్టాక్ మార్కెట్ పై Demonetization (పెద్దనోట్ల రద్దు) యొక్క ప్రభావం

Impact of Demonetization on Indian stock market:

కొన్ని సంఘటనలు అరుదుగా జరుగుతాయి. మరికొన్ని జీవితంలో కేవలం ఒక్కసారే సంభవిస్తాయి. జీవితాంతం ఎదురుచూసినా కొందరికి కొన్ని సంఘటనలను చూసే అదృష్టం (?) లభించకపోవచ్చు. అలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారికి, వృద్దాప్యంలోకి చేరుకున్న తరువాత తమ మనవళ్ళకి రకరకాల వర్ణనలు జోడించి, దానిగురించి చెప్పుకునే భాగ్యం కలుగుతుంది. Skylab కూలిపోవడం, ఎమర్జెన్సీ విధింపబడటం…అలాగే ఇప్పుడు ఈ Demonetization….

అప్పుడప్పుడూ వినడమే తప్ప స్వయంగా ఎప్పుడూ చూసి ఉండకపోవడం వల్ల (కొందరు తప్ప) ఎవ్వరికీ ఏమీ అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు Demonetization వల్ల భారత మార్కెట్లు త్వరలోనే పతనమవుతాయని కొందరు అంచనాలు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే నిజంగా ఈ Demonetization ప్రభావం మార్కెట్ పై ఎంతమటుకు ఉండవచ్చో ఓసారి చూద్దాం.

Read More

స్వింగ్ ట్రేడింగ్ : tips techniques

స్వింగ్ ట్రేడింగ్:

(Swing Trading)

ఒక రోజు నుండి మొదలు పెట్టి రెండు, మూడు వారాల వరకు గల వ్యవధిలో, స్టాక్ మార్కెట్లో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము.

ఈ పద్దతిని follow అయ్యే ట్రేడర్లు, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మార్కెట్లో ప్రైస్ momentum ఉన్న స్టాక్స్ ని గుర్తించి, వాటిలో పోజిషన్ తీసుకుంటారు. మరికొంత మంది కేవలం టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే కాకుండా ఫండమెంటల్ ఎనాలిసిస్ కూడా ఉపయోగించి ఆ స్టాక్ వాస్తవ విలువను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తారు.

స్వింగ్ ట్రేడింగ్ లో మొదటి దశ వేలాదిగా ఉన్న స్టాక్స్ లో మనకి అవసరమైన స్టాక్ ని గుర్తించడంతో మొదలవుతుంది. ఒక డాక్టర్ తన వద్దకు వచ్చిన పేషెంట్ యొక్క వ్యాధిని నిర్దారించడం ద్వారానే తగిన medicines ని సూచించగలుగుతాడు. ఆ diagnose చేసే ప్రక్రియలో పొరపాటు చేస్తే రోగి ఆ medicines వాడినప్పటికీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే. సరైన స్టాక్ ని గుర్తించడమే అసలైన పని. momentum లేని స్టాక్ లో పెట్టుబడి పెట్టడం వల్ల, చాలా సందర్భాల్లో మన విలువైన సమయంతో పాటు కొన్నిసార్లు పెట్టుబడిని కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది.

Read More