6 ముఖ్యమైన స్టాక్ మార్కెట్ వ్యూహాలు

స్టాక్  మార్కెట్  వ్యూహాలు:
 ఏదో లాటరిలో 10 రూపాయలకు టికెట్ కొని దానికి లక్ష రూపాయల బహుమతి వచ్చేలా చేయమని దేవుని ప్రార్థించినట్లు కాకుండా కొంత తెలివి మరియు శ్రమతో మార్కెట్ లో తప్పకుండా లాభాలు ఆర్జించవచ్చు. 

దీనికోసం అవసరమైన కొన్ని వ్యూహాలు ఈ వ్యాసంలో తెలుపబడ్డాయి.

1. Buy అండ్ Hold వ్యూహం : ఇదొక దీర్ఘ కాలిక విధానం. ఎంతో సురక్షితమైనది. నూటికి నూరు శాతమ విజయవంతమయ్యే అవకాశాలున్నది.  భిన్న రంగాలనుండి మంచి ఫండమెంటల్స్ ఉన్న బ్లూ చిప్స్ స్టాక్స్ ని కొన్నింటిని ఎన్నుకొని వాటిని కొనుగోలు చేయాలి.  కొన్న తర్వాత ప్రతిరోజూ వాటి ధరలు గమనిస్తూ పెరిగినపుడు “అబ్బో  త్వరగా పెరిగిందే అమ్మేస్తే పోలా” అనీ, ధర తగ్గినపుడు “అమ్మో  నష్ట మొచ్చిందే …మరింత తగ్గక ముందే అమ్మేస్తే మంచిది”  అనీ అనుకోకుండా, వాటి గురించి మరచిపోయి, ఎప్పుడైనా  మార్కెట్ కృంగినపుడు  తక్కువ  ధరకి మరిన్ని స్టాక్స్  కొనుగోలు చేయడం ఈ పద్దతిలోని  ముఖ్య సూత్రం.

2. Value Investing: ఈ విధానం కొంత మటకు buy & hold విధానం లాగానే ఉంటుంది. వేలకొద్ది ఉన్న స్టాక్స్ లో ముఖ్యమైన కొన్నింటిని ఎంచుకొని వాటి యొక్క Intrinsic వాల్యూ{నిజమైన విలువ} ని fundamental analysis ద్వారా లెక్కించి మంచి స్టాక్స్ ని గుర్తించి, వానిలో మదుపు చేసి, మార్కెట్  పడ్డప్పుడల్లా  మరిన్ని స్టాక్స్ కొనుగోలు చేయాలి .
3. Growth investing: అనేక సంవత్సరాల నుండి  వ్యాపార రంగం లో ఉన్న దిగ్గజాలైన  కంపెనీల స్టాక్ prices సహజంగానే చాలా అధిక  ధరకు  quote అవుతూ ఉంటాయి. ఇంత ఎక్కువ ధరకి స్టాక్స్ ని కొనడం ఒక రకంగా కొత్త ఇన్వెస్టర్ లకి కొంత భాదాకరమే. అయితే కొన్ని కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టినపుడు వాటికి ఇంకా అప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉండక పోవడం మూలాన  తక్కువ ధరకే లభ్యం అవుతాయి. వీటిని చాల జాగ్రత్త గా విశ్లేషించి ,అవసరమైతే నిపుణుల సలహాలను తీసుకొని ఆ రాళ్ళ మధ్య వజ్రాలను గుర్తించగలిగితే తగిన సమయంలో అత్యధిక లాభాలను పొందవచ్చు.

4. contrarian ఇన్వెస్టింగ్:  సాంప్రదాయ పద్ధతులలో ముఖ్యమైన ఇన్వెస్టింగ్ పధ్ధతి అయిన “Trend is your friend” మార్కెట్ సూక్తి ప్రకారం ఒక బుల్ లేక bear ట్రెండ్ కొనసాగుతున్నప్పుడు దానికి అనుగుణం గా ఇన్వెస్ట్ చేయడం ఎంతో శ్రేయస్కరం.

Contrarian ఇన్వెస్టింగ్ అనేది ఒక సాంప్రదాయ వ్యతిరేక విధానం. ఈ contrarian ఇన్వెస్టింగ్ లో ట్రెండ్ కి వ్యతిరేకం గా, గుంపు  మనస్తత్వానికి భిన్నంగా కొనుగోలు చేస్తారు.

       ఉదాహరణకి ఒక బుల్ మార్కెట్ ఉన్నత స్థాయికి  చేరుకున్నప్పుడు అప్పటికే మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్లు మరియు ట్రేడర్ లు ఎక్కువ శాతం అప్పటికే  ట్రేడింగ్ కి అనుగుణంగా  పెద్ద మొత్తం లో కొనుగోలు చేస్తుండటం వల్ల స్టాక్ వాల్యుయేషన్స్ మితిమీరి పోయి అప్పటికే ఇన్వెస్టర్ల ధనం అంతా మార్కెట్ లో కి  చేరి ఉండటం వల్ల indicesను (నిఫ్టీ , సెన్సెక్స్ లు) మరింత ముందుకు తీసుకు పోవడానికి తగిన ధనం లేదా మార్కెట్స్ పతనం అవుతాయి.

       ఈ  విషయానంతటిని దూర దృష్టి తో  గ్రహించే ఇన్వెస్టర్ contrarian పద్ధతిలో ఓవర్ వాల్యుడ్  అయిన స్టాక్స్ ని కాకుండా తాత్కాలికంగా సమస్యలు  ఎదుర్కుంటూ, భవిష్యత్తు లో మంచి కంపెనీగా ఎదగగల  సామర్ధ్యం ఉన్న కంపెనీలను గుర్తించి వాటిలో  సంపదను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా సమస్యలను అధిగమించి ఆ స్టాక్ లాభాల బాట పట్టినపుడు  ఆ ఇన్వెస్టర్ పెద్ద మొత్తం లో లాభాలను ఆర్జించ గలుగుతారు.

5. Best షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ పద్ధతి :   మనం కొనుగోలు చేయాలనుకున్న స్టాక్ యొక్క ఫండమెంటల్స్ మరియు టెక్నికల్ ఎనాలిసిస్ ఈ రెంటిని కలిపి సరిచూసుకొని అపుడు సంతృప్తి చెందితేనే ఆ స్టాక్స్ ని కొనుగోలు చేయాలి. అయితే ఫండమెంటల్ ఎనాలసిస్ గాని ,టెక్నికల్ ఎనాలిసిస్ గాని ఒక స్టాక్ ఖచ్చితంగా ఇంత ధరకు చేరుతుంది అని చెప్పలేవు. ఈ రెండూ విశ్లేషణలు scientific methods కావు. అయినప్పటికీ  సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వార అనేకమంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిత్యం పెద్ద మొత్తం లో లాభాలు సంపాదిస్తున్నారు.

6. Performance based mutual funds: నిత్యం stock market ను గమనించే సమయం, ఓపిక లేని వారికి mutual funds ద్వార ఇన్వెస్ట్ చేయడం మంచిది. ప్రతి ఫండ్స్ కి ఫండ్ మేనేజర్, ఆ ఫండ్ కి సంభందించిన వ్యవహారాలను చూస్తుంటాడు. ఏ స్టాక్స్ ఏ ధరపై అమ్మేయాలి, ఎన్ని స్టాక్స్ అమ్మాలి లాంటి విషయాలలో ఫండ్ మేనేజర్ దే తుది నిర్ణయం.

అందువల్ల , ఒక మ్యుచ్యువల్ ఫండ్ లో సంపద మదుపు చేసే ముందు గమనించవలసిన అంశాలు:

  1. ఆ ఫండ్ యొక్క past performance: గత సంవత్సరం  లో అంతకముందు ,ఈ ఫండ్ ఎంత లాభాలను {returns} సంపాదించింది.
  2. ఆ ఫండ్ మేనేజర్ యొక్క గత చరిత్ర :

ఒక వేళ ఆ ఫండ్ గనుక  కొత్తగా ప్రారంభించబడిన దైతే ,ఆ మేనేజర్ కి ఎంత అనుభవం ఉంది, past performance ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి .

          ఒకవేళ ఒక ఫండ్ గనుక చాలా కాలంగా ఒకే స్థిరమైన రిటర్న్స్ అందిస్తుంటే గనుక అది భవిష్యత్తులో కూడా మంచి ఫలితాల్ని ఇస్తుందని  భావించవచ్చు.    

స్టాక్ మార్కెట్ గురించి మరింత విలువైన సమాచారం చిన్న ebooks లాగా రూపొందించడం జరిగింది.

ఆసక్తి గలవారు క్రింది లింకుని click చేయవచ్చు.

 http://bit.ly/2dyNxz2

swing trading report in telugu

(Visited 6,134 times, 1 visits today)

9 thoughts on “6 ముఖ్యమైన స్టాక్ మార్కెట్ వ్యూహాలు

  1. Sir., Your website is very useful. Please post daily updates, if possible please send me pdf file in brief about Share market.

  2. Sir,
    How to calaculte Income tax on Capital Gains and Dividend on shares under which secti on of IT Act. Please inform.

  3. Dear Sir,
    Your explanation is very good and it is very use full for beginner like me, please share if any PDF formats which explaining about share markets.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *