స్వింగ్ ట్రేడింగ్ : tips techniques

స్వింగ్ ట్రేడింగ్:

(Swing Trading)

ఒక రోజు నుండి మొదలు పెట్టి రెండు, మూడు వారాల వరకు గల వ్యవధిలో, స్టాక్ మార్కెట్లో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము.

ఈ పద్దతిని follow అయ్యే ట్రేడర్లు, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మార్కెట్లో ప్రైస్ momentum ఉన్న స్టాక్స్ ని గుర్తించి, వాటిలో పోజిషన్ తీసుకుంటారు. మరికొంత మంది కేవలం టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే కాకుండా ఫండమెంటల్ ఎనాలిసిస్ కూడా ఉపయోగించి ఆ స్టాక్ వాస్తవ విలువను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తారు.

స్వింగ్ ట్రేడింగ్ లో మొదటి దశ వేలాదిగా ఉన్న స్టాక్స్ లో మనకి అవసరమైన స్టాక్ ని గుర్తించడంతో మొదలవుతుంది. ఒక డాక్టర్ తన వద్దకు వచ్చిన పేషెంట్ యొక్క వ్యాధిని నిర్దారించడం ద్వారానే తగిన medicines ని సూచించగలుగుతాడు. ఆ diagnose చేసే ప్రక్రియలో పొరపాటు చేస్తే రోగి ఆ medicines వాడినప్పటికీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే. సరైన స్టాక్ ని గుర్తించడమే అసలైన పని. momentum లేని స్టాక్ లో పెట్టుబడి పెట్టడం వల్ల, చాలా సందర్భాల్లో మన విలువైన సమయంతో పాటు కొన్నిసార్లు పెట్టుబడిని కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది.

అందువల్ల స్వింగ్ ట్రేడర్లు నిరంతరం తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉండాలి. దీనికి తగిన సహనం అవసరం.

వచ్చామా, ఏదో స్టాక్ లో పోసిషన్ తీసుకున్నామా ….ఇక facebookలో పోస్ట్ పెట్టి ఇక లైకుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్లు పోద్దస్తామానూ ఆ స్టాక్ ధర ఎప్పుడు పెరుగుతుందా అని చూసామా అన్నట్లు కాకుండా, పోసిషన్ తీసుకునే ముందే తగిన ఓపికతో రీసెర్చ్ చేయడం అవసరం.

స్వింగ్ ట్రేడర్ల మొదటి లక్ష్యం తక్కువ నష్టంతో, ఎక్కువ లాభాలను పొందడానికి ప్రయత్నం చేయడం.

స్వింగ్ ట్రేడింగ్ యొక్క రహస్యాలను, టెక్నిక్ లనూ పూర్తిగా అర్థం చేసుకోవడానికి చదవండి……

swing trading report in telugu
swing trading report in telugu
(Visited 755 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *