స్టాక్ మార్కెట్ పై Demonetization (పెద్దనోట్ల రద్దు) యొక్క ప్రభావం

Impact of Demonetization on Indian stock market:

కొన్ని సంఘటనలు అరుదుగా జరుగుతాయి. మరికొన్ని జీవితంలో కేవలం ఒక్కసారే సంభవిస్తాయి. జీవితాంతం ఎదురుచూసినా కొందరికి కొన్ని సంఘటనలను చూసే అదృష్టం (?) లభించకపోవచ్చు. అలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారికి, వృద్దాప్యంలోకి చేరుకున్న తరువాత తమ మనవళ్ళకి రకరకాల వర్ణనలు జోడించి, దానిగురించి చెప్పుకునే భాగ్యం కలుగుతుంది. Skylab కూలిపోవడం, ఎమర్జెన్సీ విధింపబడటం…అలాగే ఇప్పుడు ఈ Demonetization….

అప్పుడప్పుడూ వినడమే తప్ప స్వయంగా ఎప్పుడూ చూసి ఉండకపోవడం వల్ల (కొందరు తప్ప) ఎవ్వరికీ ఏమీ అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు Demonetization వల్ల భారత మార్కెట్లు త్వరలోనే పతనమవుతాయని కొందరు అంచనాలు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే నిజంగా ఈ Demonetization ప్రభావం మార్కెట్ పై ఎంతమటుకు ఉండవచ్చో ఓసారి చూద్దాం.

  1. భారత స్టాక్ మార్కెట్లలోకి వచ్చే సొమ్ము ఏదైనా బ్యాంకు అకౌంట్ల నుండే ప్రవేశిస్తుంది. ట్రేడింగ్ అకౌంట్లు ప్రారంభించే సమయంలోనే ప్రతీ ఖాతాదారుని యొక్క PAN నంబరుతో సహా అన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి జవాబుదారీతనం తప్పనిసరిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లోలాగా cash ఇష్టం వచ్చినట్లు కుమ్మరించడానికి ఇక్కడ అవకాశం ఉండదు. అలాగే ట్రేడింగ్ సంస్థలు, బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తాయి కాబట్టి ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు కనిపించినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న భయం తప్పనిసరిగా ఉంటుంది.

అందువల్ల మార్కెట్లలో భారీస్థాయిలో నల్లధనం ఉండే అవకాశం ఏమాత్రం లేదు.

  1. బ్యాంకుల వద్ద భారీస్థాయిలో డిపాజిట్లు చేరుకుంటున్నాయి. ప్రభుత్వం వద్ద కూడా పన్ను వసూళ్లు, జరిమానాలు etc రూపాల్లో పెద్దమొత్తంలో ఆదాయం సమకూరబోతోంది. ఇదంతా కూడా కొన్ని నెలల తరువాత మళ్ళీ వ్యక్తిగత, వాహన, గృహరుణాల రూపంలో తక్కువ వడ్డీకి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. మార్కెట్లో డబ్బు యొక్క ప్రవాహం (లిక్విడిటీ) మొదలయినప్పుడల్లా, వ్యాపారం బాగా జరిగి స్టాక్ మార్కెట్లోని దాదాపు అన్ని కంపెనీలకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మేలు జరుగుతుంది. ఇది చాలా మంచిది.
  2. స్టాక్ మార్కెట్లోని కొన్ని రంగాలకి ప్రయోజనం లభించబోతుండగా మరికొన్ని రంగాలు నష్టపోనున్నాయి.

ఈ సమయంలో లాభదాయకమైనవి

  • డిజిటల్ వాల్లెట్ లు
  • Banking రంగం
  • హౌసింగు ఫైనాన్సు సంస్థలు (LIC హౌసింగు ఫైనాన్సు లాంటివి)

నష్టపోయే అవకాశమున్నవి:

  • రియల్ ఎస్టేట్
  • సిమెంటు
  • ఆటోమొబైల్

అయితే వ్యక్తుల వద్దనున్న నల్లధనం బ్యా0కుల్లోకి చేరుకోవడం ఇంకా పూర్తికాలేదు. కాబట్టి ఇప్పుడే ఫలానా దిశలో మార్కెట్ దూసుకెళ్తు0దన్న అంచనా ఇప్పుడే వేయడం సాధ్యం కాదు కూడా. అయితే ఏదో జరగబోతుందన్న ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. జీవితంలో ఎప్పుడూ రుచి చూడని సంఘటన కావడం వల్ల కాస్తంత అప్రమత్తంగా ఉంటూ మార్కెట్ ను గమనిస్తూ ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.

(Visited 412 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *